Home

»

Latest News

'హరి హర వీరమల్లు' ఫస్ట్ డే కలెక్షన్స్.. మైండ్ బ్లాక్!

Jul 24, 2025 3:00PM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో అడుగుపెట్టింది. సెకండాఫ్ వీక్ గా ఉందనే మాటలు వినిపిస్తున్నప్పటికీ.. ఓవరాల్ గా మూవీ పవన్ ఫ్యాన్స్ ని మెప్పించేలా ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉందనేది పక్కన పెడితే.. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (Hari Hara Veera Mallu)

 

తెలుగునాట కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ గా పవన్ కళ్యాణ్ కి పేరుంది. 'హరి హర వీరమల్లు'తో ఆ మాట మరోసారి రుజువు కాబోతుంది. జూలై 23 రాత్రి నుంచే వీరమల్లు షోలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మెజారిటీ షోలు ఫుల్ అయ్యాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కూడా ఫస్ట్ డే బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది. ఆఫ్ లైన్ సేల్స్ బాగానే ఉన్నాయి. ఈ లెక్కన 'హరి హర వీరమల్లు' మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. 

 

ప్రస్తుతం థియేటర్లలో 'హరి హర వీరమల్లు' తప్ప వేరే బడా సినిమాలు లేవు. ప్రేక్షకులు చాలా రోజులుగా ఓ భారీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో 'హరి హర వీరమల్లు' విడుదలైంది. దానికితోడు గురువారం విడుదల కావడంతో.. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చింది. దీంతో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com