నిత్యం నవ్వుతూ...కనిపించే చైతూ!!
on Nov 22, 2018
`జోష్ ఫుల్ గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున తనయుడు నాగచైతన్య. ముద్దుగా చైతు అని పిలుచుకునే ఈ యంగ్ తొలి సినిమాతో హీరోగా పాస్ మార్కులు కొట్టేసాడు. `ఏమాయ చేసావే` చిత్రంతో ప్రేక్షకులను ఏదో మాయ చేసి `100%` లవ్ తో హండ్రెడ్ పర్సెంట్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకొని `దడ`, `బెజవాడ` చిత్రాలతో తడాఖా చూపించాడు చైతు. `మనం`దరం గర్వపడేలా మూడు తరాల హీరోలు నటించి తెలుగు సినిమా యొక్క సత్తా ఏమిటో చాటి చెప్పారు అక్కినే హీరోలు. `ఆటో నగర్ సూర్య` చిత్రం అంతగా ఆడకపోయినా...`ఒకలైలా కోసం తో ఫర్వాలేదనిపించుకున్నాడు. `దోచెయ్` చిత్రం ప్రేక్షకుల మనసులు దోచుకోలేదు...కానీ, `ప్రేమమ్` చిత్రంతో అంతకు ముందు వచ్చిన ఫ్లాపులన్నీ సమమ్ చేశాడు. `సాహసం శ్వాసగా సాగిపోతూనే రారండోయ్ వేడుక చేద్దామంటూ యుధ్దం శరణం అన్నాడు ఈ శైలజా రెడ్డి అల్లుడు, మన సవ్యసాచి. జయాపజయాలు పక్కన పెడితే ఒక్కో సినిమాతో ఒక్కో కొత్త జానర్ ని ఎంచుకుంటూ యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్ అవుతూ తనను తాను ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరో నాగ చైతన్య. ఏమాయ చేసావే చిత్రంతో చై, సామ్ లు ప్రేమించుకున్నారు..ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో రెండు సినిమాల్లో నటించారు. దీనితో వీరి ప్రేమ మరింత బలపడింది ...మూడు ముళ్లు పడేలా చేసింది. ప్రస్తుత రియల్ లైఫ్ ఒక్కటైన వీరు రీల్ లైఫ్ లో కూడా కపుల్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి మజిలీ టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హిట్స్, ఫ్లాప్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ..ఎప్పుడూ పాజిటివ్ గా, నవ్వుతూ పలకరించే చైతుకి బర్త్ డే విసెష్ తెలియజేస్తోంది తెలుగువన్ డాట్ కామ్.