
-సినిమా పేరు: హనుమాన్ అంశ్
-నటీనటులు: శోభినవ్ సత్య, పూర్ణిమ తివారి, చందన్ కె ఆనంద్, అనిల్ రస్తోగి, భగవాన్ దాస్ పటేల్ తదితరులు
-సినిమాటోగ్రఫీ: విశాల్ బవ
-ఎడిటింగ్: శంకు రజాధ్యక్ష
-మ్యూజిక్: సాదు సుశీల్ తివారి
-నిర్మాతలు: రాగిణి సోన, నమ్రిత సింగ్ , విశాల్ చతుర్వేది,అనుప్రియ
-బ్యానర్స్: శంభు మీడియా నెట్ వర్క్ ,హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్
-రిలీజ్: హోంబులే ఫిల్మ్స్
-రచన,దర్శకత్వం: విశాల్ చతుర్వేది
-రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 9 ,2026
ఆగస్టు 7 న బాలీవుడ్ లో విడుదలై 400 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం హనుమాన్ అంశ్. ఈ రోజు తెలుగు సెల్యులాయిడ్ పై తెలుగులో అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
లక్ష్మణ్ కుమార్( శోభినవ్ సత్య) మూడేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోతాడు. దీంతో నేను కూడా తల్లి దగ్గరికి వెళ్లిపోతానని మారం చేసే నైజం. ఆ తర్వాత తల్లి నేర్పించిన అంతర్ముఖ మనసుతో కూడిన 'ధ్యానం' తో పాటు 'సీతారామ్' అనే మహత్తరమైన పదాన్ని జీవశ్వాశ గా చేసుకొని దేశమే తన కుటుంబం అని పలు ప్రాంతాలలో పర్యటిస్తాడు. ప్రతి మనిషిలోనూ శివుడు కొలువుతీరి ఉంటాడనేది కూడా లక్ష్మణ్ కుమార్ నమ్మకం. రాముడ్ని చేరుకోవడమే తన లక్ష్యంతో పాటు ఆంజనేయ స్వామిని నిత్యం కొలుస్తుంటాడు. ఈ క్రమంలో చివరకి ఉత్తరాఖండ్ లోని 'నీమ్ కరోలి' అనే గ్రామం తన స్థావరం అవుతుంది. ఆ తర్వాత తన తండ్రి వచ్చి చిన్నపుడే పెళ్లి చేసుకున్న భార్య( పూర్ణిమ తివారి) సంగతి ఏంటని అడుగుతాడు. దీంతో లక్ష్మణ్ కుమార్ భార్య దగ్గరకి వస్తాడు. భార్య దగ్గరకి వచ్చిన లక్ష్మణ్ కుమార్ తిరిగి వెళ్లాడా? వెళ్తే 'నీమ్ కరోలి' బాబాగా ప్రాచుర్యం పొందటానికి బాబా అవలంబించిన పద్దతలు ఏంటి? బాబా ఎందుకు ఎప్పడు క్లీన్ షేవ్ తో ఉంటాడు? చూపించిన మహిమలు ఏంటి? మానవాళికి బాబా చెప్పిన మార్గం ఏంటి? అనేదే 'హనుమాన్ అంశ'
ఎనాలసిస్
మూవీ చూస్తున్నంత సేపు ఆధ్యాత్మిక భావనలో ఉండిపోతాం. మేకర్స్ చాలా తెలివిగా ఆ ఆధ్యాత్మికతని రెగ్యులర్ ఫార్మట్ లో కాకుండా చాలా తెలివైన స్క్రీన్ ప్లే తో చెప్పడం హనుమాన్ అంశ స్పెషల్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మూవీ ప్రారంభమే రివర్స్ స్క్రీన్ ప్లే తో ఇండియాకి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్న ఒక డాక్టర్ పై ఓపెన్ చేసి క్యూరియాసిటీ కలిగించారు. ఆ తర్వాత తన ఆకలి తీర్చడం కోసం నీమ్ కరోలి బాబా రావడం సీన్ సూపర్. ఇక ఆ డాక్టర్ పైనే బాబా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చెప్పించడం, ఈ క్రమంలోనే బాబా పన్నెండేళ్ల వయసు సీన్స్ తో పాటు తను చెప్పిన మాటలు, జీవిత సత్యాలతో వచ్చిన సీన్స్ అన్ని బాగున్నాయి.
కాకపోతే నీమ్ కరోలి అనే ఊరిలోనే బాబా ఎందుకు ఉన్నాడనే విషయాన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. ఎందుకంటే ప్రవహించే నీరు లాగా ఒకే చోట ఉండకూడదు, ఏ ప్రాంతం పైన ప్రేమని పెంచుకోకుడదు అనేది బాబా సిద్ధాంతం. బాబా, తన శిష్యుల మధ్య వచ్చిన సీన్స్ లో ఎన్నో జీవిత సత్యాలు తెలిసాయి. శిష్యుడుకి శివుడిలా కనిపించే సీన్ అయితే గూస్ బంప్స్ . ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ చూసుకుంటే బాబాలో ఉన్న అంతర్ముఖ కార్యుడు మరింతగా ప్రజ్వల్లాడు. బ్రిటిష్ అధికారితో వచ్చిన ట్రైన్ ఎపిసోడ్ ఎక్స్ లెంట్. గూస్ బంప్స్ కూడా వస్తాయి. వైఫ్ తో వచ్చిన సీన్స్ తో పాటు మళ్ళీ నీమ్ కరోలి తిరిగి రావడం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా బాగున్నాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
నీమ్ కరోలి బాబానే సెల్యులాయిడ్ పైకి వచ్చాడా అనే విధంగా శోభినవ్ సత్య పెర్ఫార్మ్ మొదటి నుంచి చివరి వరకు సాగింది. ప్రతి సన్నివేశంలోను జీవాన్ని సృష్టించడంలో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యాడు. చిన్న వయసప్పుడు చేసిన బాల నటుడి క్యారక్టర్ కూడా మెరుపులు మెరిపించాడు. బాబా శిష్యులుగా చేసిన వాళ్లతో పాటు రామ్ నందన్ భోస్లే ( చందన్ కె ఆనంద్) పూర్ణిమ తివారి, నిఖిల్ దూబే, భగవాన్ దాస్ పటేల్ ఇలా అందరు తమ క్యారెక్టర్స్ లో మెస్మరైజ్ చేసారు. విశాల్ చతుర్వేది దర్శకత్వ ప్రతిభ , విశాల్ బవ ఫొటోగ్రఫీ, సాదు సుశీల్ తివారి మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన హైలెట్.
బలాలు
1 . కథ , కథనం
2 . శోభినవ్ సత్య పెర్ ఫార్మెన్స్
3 . డైరెక్షన్
చివరిగా చెప్పాలంటే పక్కా డివోషనల్ మూవీ.. చక్కటి రామ భజనకి వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుంది.
అరుణాచలం




