.webp)
వందల వందల కోట్లు ఎందుకు ఖర్చుపెడుతుంటారో తెలియని వాళ్ళకి సినిమా అంటే పెన్ను, పేపర్ సాయంతో, ప్రస్తుతం ప్రేక్షకుల మూడ్ ఎలా ఉందో కనిపెట్టి మంచి కథతో కూడిన కంటెంట్ ని సృషించడమే. లేదంటే ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా సినిమాకి ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే కోట్లుని కాకుండా రూపాయి ఎలా ఖర్చుపెట్టాలో తెలిసేలా 'హనుమాన్ అంశ్' లాంటి సినిమాలని ప్రేక్షకులకి అందిస్తే వాళ్ళ జేబుల్లో డబ్బులు మేకర్స్ అకౌంట్ లో ఉంటాయి.
ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత విశేషాలు, ఆయన మహిమల ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' 400 కోట్ల అరుదైన మైలురాయి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. వ్యాపార వర్గాలు, సినీ విశ్లేషకులు సైతం ఈ కలెక్షన్ల ప్రవాహాన్ని చూసి విస్తుపోతున్నారు. ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి వసూళ్లు 1.08 కోట్లకు చేరుకున్నాయి. అయితే రెండో వారంలో కాస్త మందగించి కేవలం. 40 లక్షలు మాత్రమే రాబట్టడంతో, రెండు వారాల మొత్తం వసూళ్లు 1.48 కోట్ల దగ్గరే నిలిచిపోయాయి. చాలామంది ఈ చిత్రం ఇక్కడితో ఆగిపోతుందని భావించిన వేళ, మూడో వారం నుంచి ఊహించని అద్భుతం జరిగింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ ఈ సినిమా రూపురేఖలనే మార్చేసాయి. దేవుడి మహిమలు, ఆధ్యాత్మిక భావనలు ప్రేక్షకుడి హృదయాన్ని తాకడంతో థియేటర్ల దగ్గర జనాలు క్యూ కట్టడం ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: మారెమ్మ ఓటిటి డేట్ వచ్చేసింది: అమ్మ తల్లో, మాయమ్మో!

ఈ జోరు ఏమాత్రం తగ్గకుండా ఏకంగా 47వ రోజున కూడా బాక్సాఫీస్ వద్ద రోజుకు దాదాపు 5 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు రూ. 200 కోట్ల భారీ షేర్ సాధించిన ఈ సినిమా ట్రేడ్ వర్గాలకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మొదట ఈ చిత్ర తెలుగు హక్కులను దర్శకుడు త్రివిక్రమ్ కొనుగోలు చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం చూసి తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో ఈ చిన్న చిత్రం తెచ్చిపెట్టిన లాభాలను, ఇతర భారీ బడ్జెట్ సినిమాల ఫలితాలతో పోలుస్తూ నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఉదాహరణకు. 450 కోట్ల మైండ్ బ్లోయింగ్ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' ప్రపంచవ్యాప్తంగా 342 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించి బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. 400 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడైన టాక్సిక్ చివరకు కేవలం రూ. 160 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. కేవలం 2 కోట్ల బడ్జెట్ సినిమా 200 కోట్ల షేర్ తెచ్చిపెడితే, 450 కోట్ల భారీ చిత్రం డిజాస్టర్‌గా మిగలడంపై బాక్సాఫీస్ విశ్లేషకులు విస్తుపోతున్నారు. గొప్ప కథనం, నిజాయితీ ఉన్న మేకింగ్ ముందు బడ్జెట్లు ఎప్పుడూ ద్వితీయమేనని 'హనుమాన్ అంశ్' బాక్సాఫీస్ వద్ద మరోసారి రుజువు చేసింది.కేవలం . 2 కోట్ల అత్యంత స్వల్ప బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ విజువల్ వండర్, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 366 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సినిమా అనేది ఇస్త్రీ చొక్కా నలగకుండా ధర్మ బద్దంగా ఓవర్ నైట్ కరోడ్ పతిని ఎలా చేస్తుందో నిరూపించింది.
[Hanuman Ansh Collections, Hanuman Ansh budget, Toxic, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]





