Home

»

Latest News

Hansika Motwani: విడాకులపై తొలిసారి నోరు విప్పిన హన్సిక.. రీజన్ తెలిస్తే షాక్ గ్యారంటీ 

Apr 18, 2026 5:06PM

 

 

2022లో సోహెల్ కతురియాతో ఘనంగా పెళ్లి 
గత నెల 11 న డైవర్స్ 
తొలిసారి స్పందించిన హన్సిక 


హమ్మయ్య ఇప్పుడు హన్సిక(Hansika Motwani)అభిమానులు ఫుల్ హ్యాపీ. తన భర్త  సోహెల్ కతురియాతో మార్చి 11, 2026న విడాకులు తీసుకున్నా కూడా అభిమానుల్లో ఏ మూలనో హన్సిక కి విడాకులు తీసుకోవడం ఇష్టమేనా, లేక ఎవరి బలవంతమైన ఉందా అని మదన పడుతూ ఉన్నారు. కానీ రీసెంట్ గా హన్సిక స్పందించడంతో వాళ్లంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 

రీసెంట్ గా హన్సిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె మాట్లాడుతు మనం ఎప్పుడైనా తెలియక తప్పుడు రైలు ఎక్కినప్పుడు అది తప్పు అని తెలిసిన వెంటనే దిగిపోవడమే మంచిది.  బాధపడుతు ప్రయాణాన్ని కొనసాగించడంలో అర్థం లేదు. నేను   తీసుకున్న నిర్ణయం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదు.ప్రస్తుతం నేను మానసిక ప్రశాంతతతో చాలా సంతోషంగా ఉన్నాను. విడాకులకి దారితీసిన కారణాలు వ్యక్తిగతం. వాటిని బయటపెట్టడానికి నాకు ఇష్టం లేదు. కష్టకాలంలో నా తల్లి, సోదరుడు అండగా నిలిచారు.  వారి మద్దతుతోనే ఆ చీకటి రోజులని దాటగలిగానని హన్సిక చెప్పుకొచ్చింది.


also read: Nagababu: రాముడు vs నాగబాబు vs ప్రకాష్ రాజ్.. ప్రకాష్ రాజ్ అస్సలు ఊహించి ఉండడు


 హన్సిక, సోహెల్ కతురియాల వివాహం 2022లో చాలా ఘనంగా జరిగింది. సోహైల్ కి హన్సికతో రెండవ వివాహం. 2024 నుంచే విడిగా ఉంటున్న ఈ జంట పరస్పర అంగీకారంతోనే  విడాకులు తీసుకోవడం జరిగింది.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com