Home

»

Latest News

Varanasi: హాలీవుడ్ రేంజ్‌లో వారణాసి.. సెట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Mar 25, 2026

  • కాశీని రీ-క్రియేట్ చేసిన రాజమౌళి
  • వారణాసి కోసం జక్కన్న చెక్కిన అద్భుతం

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో రాబోతున్న ‘వారణాసి’(Varanasi) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి వస్తున్న ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ కి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. రాజమౌళి తన విజన్‌కు తగ్గట్టుగా వారణాసి(కాశీ) నగరాన్ని అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు.

సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాల కోసం రాజమౌళి టీమ్ వారణాసి నగరాన్ని రీ-క్రియేట్ చేస్తూ ఒక భారీ సెట్‌ను నిర్మించింది. గంగానది ఘాట్లు, పురాతన వీధులు, ఆలయ నిర్మాణాలను కళ్ళకు కట్టినట్లు ఈ సెట్‌లో రూపొందించారు. సహజత్వం కోసం రాజమౌళి ఎక్కడా రాజీ పడకుండా, టెక్నికల్ టీమ్‌తో కలిసి ఈ సెట్‌ను అత్యంత గొప్పగా తీర్చిదిద్దారు. వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యంలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్‌కు సంబంధించిన ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇక్కడే షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమాలోని ప్రతి సన్నివేశం సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని సమాచారం. CGI కంటే రియల్ సెట్స్‌పై ఎక్కువగా ఆధారపడటం ఆయన స్టైల్. ఈ క్రమంలో వందలాది కార్మికులు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సభ్యులు నెలల తరబడి శ్రమించి ఈ సెట్స్‌ను సిద్ధం చేశారు.

ఈ సెట్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. “ఇది సినిమా సెట్టా? లేక నిజమైన కాశీనా?” అనే స్థాయిలో కామెంట్లు వస్తున్నాయి. రాజమౌళి మరోసారి తన విజువల్ మ్యాజిక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళి గత చిత్రాలైన ‘బాహుబలి’, ‘RRR’ చిత్రాల్లో సెట్స్ ఎంత సహజంగా ఉంటాయో మనకు తెలిసిందే. ఇప్పుడు వారణాసి కోసం వేసిన సెట్స్ అద్భుతంగా ఉండటంతో, ఆ విజువల్స్ వెండితెరపై ఎంత గొప్పగా ఉంటాయోనని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నారు. గంగా నది నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఈ సినిమా కోసం మహేష్ బాబు తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు రెండేళ్లుగా కేవలం దీనికే సమయాన్ని కేటాయించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండే యాక్షన్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

‘వారణాసి’ సినిమాను కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అడ్వెంచర్, మైథాలజీ, టైమ్-ట్రావెల్ అంశాల కలయికగా రూపొందుతోంది.

ఈ సినిమా 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. IMAX ఫార్మాట్‌లోనూ రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com