
నట సింహం నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ సినీలోకం మొత్తం ఎదురు చూస్తోంది. దర్శకుడు క్రిష్ పెళ్లి కారణంగా మధ్యలో బ్రేక్ రావడంతో షూటింగ్ మళ్లీ తిరిగి పట్టాలెక్కింది. మధ్యప్రదేశ్‌లో తాజా షెడ్యూల్‌లో బాలయ్య, హేమామాలిని, శ్రేయలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శాతకర్ణి సినిమా ఓపెనింగ్ నుంచి నేటి వరకు బాలయ్య గురించిన ఫస్ట్ లుక్, ఇతర వివరాలు మాత్రమే రిలీజ్ చేయడంతో మిగిలిన వారు ఎలా ఉన్నారో చూడాలని ప్రేక్షకులు ఎగ్జయిట్ అవుతున్నారు. వీరి బాధను అర్థం చేసుకున్న చిత్రయూనిట్ రాజమాత, రాణి గేటప్స్‌ని రిలీజ్ చేసింది. పసిపిల్లాడిని ఎత్తుకున్న శ్రీయ..పక్కనే గంభీరంగా కనిపిస్తున్న హేమామాలిని..రాజు గెటప్‌లో బాలకృష్ణ కోటలోకి వస్తున్న పిక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.






.jpg)
