Home

»

Latest News

Raja Shivaji: జెనీలియా కన్నీళ్లు.. రితీష్ ఎమోషనల్ 

Apr 21, 2026 12:30PM


-హాసిని గుర్తుంది కదా
-మే 1 న రాజా శివాజీతో రాక
-ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు 

 

హ.. హ.. హాసిని అంటు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి జెనీలియా(Genelia D Souza). తన హిట్ లిస్ట్ చాలానే పెద్ద. పైగా ఆయా క్యారెక్టర్ల తాలుకు  ప్రాభవానికి    ఎక్స్ పైరీ డేట్ అనేది కూడా అసాధ్యం. మహారాష్ట్ర దినోత్సవం రోజైన మే 1 న తన భర్త రితీష్ దేశముఖ్(Riteish Deshmukh)తో కలిసి 'రాజా శివాజీ'(Raja shivaji)మూవీతో వస్తుంది. ఇది అల్లా టప్పా సినిమా కాదు. మరాఠా యోధుడు హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అంత అల్లా టప్పా సినిమా కాదు అని ఎంతో కష్టంతో కూడుకున్నదనే విషయం నిన్న జెనీలియా, రితీష్ కన్నీటి చుక్కల సాక్షిగా అర్ధమవుతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం.

'రాజా శివాజీ' ట్రైలర్ లాంచ్ నిన్న ముంబై(Mumbai)వేదికగా జరిగింది. ఈ సందర్భంగా రితీష్ మాట్లాడుతు శివాజీ మహారాజ్ వంటి గొప్ప వీరుడి కథని సెల్యులాయిడ్ పైకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాను. కానీ  ఈ ప్రపంచంలో శివాజీ పై ఎన్ని వందల సినిమాలు వచ్చినా, ఎంతటి గొప్ప దర్శకులు ఉన్నా.. శివాజీ మహారాజ్ కీర్తికి పూర్తి న్యాయం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన పేరు, ప్రజలకు ఆయనపై ఉన్న గౌరవం ముందు మా ప్రయత్నం చాలా చిన్నది. ఇది నా జీవితకాల స్వప్నం. ఈ కల నిజం కావడానికి నా టీమ్ మొత్తం ప్రాణం పెట్టి పనిచేసింది. జెనీలియా నా లైఫ్ లో   అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్. ఆమె లేకపోతే ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదని  చెమర్చిన కళ్ళతో చెప్పాడు. రితీష్ ఆ విధంగా మాట్లాడుతున్నంత సేపు జెనీలియా ఏడుపుని ఆపుకోలేక పోయింది. ఒకానొక సమయంలో తన కన్నీరుని ఆపుకోలేక వెనక్కి కూడా తిరిగి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటూనే ఉంది.


Also read: Ntr: ఫ్యాన్స్ ని ఉర్రుతలూగించే బిగ్ న్యూస్

  
రితేష్ స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవరిస్తూ ఉన్నాడు.  శివాజీ భార్య సాయి బాయ్ గా జెనీలియా నే చేస్తుంది. భిషేక్ బచ్చన్, సంజయ్ దత్, విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్ ముఖ్యమైన రోల్స్ లో కనిపిస్తున్నారు. రితేష్, జెనీలియా తనయుడు రాహిల్ కూడా చిన్నప్పటి శివాజీగా కనిపిస్తుండటం విశేషం. మరాఠీ, హిందీతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది.  ధురంధర్ 2 తో రికార్డులు సృష్టిస్తున్న జియో స్టూడియోస్ కూడా నిర్మాణ బాధ్యతల్లో ఒకరిగా ఉంది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com