Home

»

Latest News

GDN మూవీ ట్విట్టర్ రివ్యూ.. తెలుగు తేజం బయోపిక్ ఎలా ఉందంటే.?

Aug 7, 2026 11:25AM

భారతదేశపు ఎడిసన్‌గా సుప్రసిద్ధులైన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (జీడీ నాయుడు) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘జీడీఎన్’ (GDN). జీడీ నాయుడు ఎవరో కాదు.. మన తెలుగు తేజమే. కోయంబత్తూరులో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీలో ఆయన జన్మించారు. 

చరిత్ర మరచిపోయిన ఆ గొప్ప మహానీయుడి కథనే ఇప్పుడు వెండితెరపై ఆవిష్కరించారు విలక్షణ నటుడు ఆర్. మాధవన్. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ తర్వాత మాధవన్ నటించి, నిర్మించిన చిత్రం ‘జీడీఎన్’. కోయంబత్తూరులో తొలి తరం పారిశ్రామికవేత్తగా, అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన జీడీ నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా కృష్ణకుమార్ రామాకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వస్తోంది.

ట్విట్టర్ లో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న ఒకే ఒక్క మాట.. “ఇది ప్రౌడ్ ఇండియన్ సినిమా”. భారతదేశంలో పుట్టి, ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసి, బ్రిటిష్ అధికారులతో సైతం ధైర్యంగా పోరాడిన ఒక గ్రేట్ ఇండియన్ ఇన్వెంటర్ కథను ఈ సినిమాలో ఎంతో నిజాయితీగా చూపించారని కొనియాడుతున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథనం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుందని అంటున్నారు. జీడీ నాయుడు జీవితంలో ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు, ఆయన అనుభవించిన కష్టాలు, సాధించిన విజయాలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని రాసుకొస్తున్నారు.

ఇందులో మాధవన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 25 ఏళ్ల యువకుడిగా మొదలుపెట్టి 75 ఏళ్ల వృద్ధుడి వరకు.. జీడీ నాయుడు జీవితంలోని వివిధ దశలను మాధవన్ తన అద్భుతమైన వైవిధ్యంతో జీవించేశారనే చెప్పాలి. కృషి, పట్టుదల, దేశంపై ప్రేమ, కోపం, ఆలోచన.. ఇలా ప్రతి ఎమోషన్ లో మాధవన్ నటన మైండ్ బ్లోయింగ్ అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ బయోపిక్‌కు మరో ప్రధాన బలం ఇందులో నటించిన సపోర్టింగ్ కాస్ట్. జయరామ్, సత్యరాజ్, ప్రియమణి, దుషారా విజయన్, కరుణాకరన్ ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కథలోని ఎమోషనల్ డెప్త్ ని ఎలివేట్ చేయడంలో గోవింద్ వసంత అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

చరిత్ర మరచిపోయిన ఒక గొప్ప విజేత జీవితాన్ని ఈ తరానికి పరిచయం చేసినందుకు మాధవన్‌కి నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. స్పూర్తిదాయకమైన బయోపిక్స్ ఇష్టపడేవారు, కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించేవారు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఈ ‘జీడీఎన్’ అని అంటున్నారు. 

 

 

GDN Movie, GDN Review, R Madhavan, GD Naidu, Biopic

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com