
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిపై ఓ భయంకరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని పాటల్ని బాజీరావు మస్తానీ నుంచి తీసుకొన్నారని, ఆ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్‌ని వాడేశారని, సౌండ్ ట్రాక్స్‌కూడా ఎత్తేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రిష్‌కి బాలీవుడ్‌తో ఉన్న పరిచయాల వల్లే ఇదంతా సాధ్యమైందని, హక్కులు తీసుకొనే బాజీరావు మస్తాని అవుట్ పుట్ వాడుకొన్నారని చెప్పుకొన్నారు. అయితే.. వీటిపై క్రిష్ స్పందించాల్సి వచ్చింది. బాజీరావు మస్తానికి కాపీ అంటూ వస్తున్న వార్తల్ని క్రిష్ ఖండించాడు.
ఇది అచ్చ తెలుగు సినిమా అనీ, ఏ ఇతర సినిమానీ కాపీ కొట్టాల్సిన అవసరం లేదని, అసలు ఆ ఊహే మాకు రాలేదని చెబుతున్నాడు క్రిష్. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం నలభై రోజులుగా రాత్రీ పగలూ కష్టపడుతున్నామని, మరో పది హేను రోజుల వర్క్ ఉందని, ఈలోగా ఇలాంటి పుకార్లు రావడం బాధాకరమని సెలవిచ్చాడు క్రిష్. ఈనెల 26న పాటలు విడుదల కాబోతున్నాయి. అప్పటి వరకూ ఆగితే చాలు. బాజీరావు మస్తానీ పాటలకూ, గౌతమి పుత్ర ఆడియోకీ ఉన్న లింకేంటో తెలిసిపోతుంది. జస్ట్... వెయిట్ అండ్ సీ.




.jpg)

