చిరుకు కౌంటర్.. బాలయ్యకు సెల్యూట్..
on Jan 12, 2017
బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా అందరూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసందే. ఇప్పుడు ఈ సినిమాపై వివాదాల వర్మ రాంగోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశాడు. ఈ సినిమాను పొగుడుతూ వర్మ ఇంతకు ముందే పలు ట్వీట్లు చేశాడు. ఈరోజు రిలీజ్ అయిన నేపథ్యంలో మరోసారి తన ట్విట్టర్ కు పని చెప్పాడు. దర్శకుడు క్రిష్‌కు, బాలయ్యకు 100 చీర్స్ అని ట్వీట్ చేశారు. అరువు తెచ్చుకున్న కథతో కాకుండా.. యదార్థ కథతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఆకాశానికి తీసుకెళ్లారని.. ఇందుకు దర్శకుడు క్రిష్, బాలయ్యకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. బాలకృష్ణ 100వ చిత్రం 150 సార్లు గొప్ప చిత్రంగా నిలిచిందనే అర్థంతో వర్మ ట్వీట్ చేశారు. మొత్తానికి వర్మ బాలయ్యను పొగుడుతూనే మరోపక్క చిరంజీవికి కౌంటర్ ఇచ్చినట్టే చేశాడు ట్వీట్.