Home

»

Latest News

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ నిర్మాత గణేష్

May 9, 2011 5:54PM

పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" నిర్మాత గణేష్ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే హిందీలో కండల కాంతారావ్ అదేనండీ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ "దబాంగ్" ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా, "గబ్బర్ సింగ్" పేరుతో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమాని ముందుగా పవన్ కళ్యాణ్ క్రియెటీవ్ వర్క్స్ బ్యానర్ పైన హీరో పవన్ కళ్యాణే స్వయంగా నిర్మిస్తారని వినపడినా, మళ్ళీ కాదని తెలిసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రాన్ని నిర్మించిన నటుడు గణేష్ ఈ పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" చిత్రాన్ని కూడా నిర్మించనున్నారని తెలిసింది.

పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. హరీష్ శంకర్ గతంలో రవితేజ హీరోగా, జ్యోతిక హీరోయిన్ గా నటిమచిన "షాక్" చిత్రానికి దర్శకత్వం వహించి షాక్ తిన్నా, త్వరగా కోలుకుని మళ్ళీ అదే రవితేజ హీరోగా, రీచా గంగోపాథ్యాయ, దీక్షా సేథ్ లు హీరోయిన్ లుగా, యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, రమేష్ పుప్పాల నిర్మించిన "మిరపకాయ్" సినిమాతో తన దమ్మెంతో, దర్శకుడిగా తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నారు. అన్నట్టు పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com