‘గేమ్ ఛేంజర్’ పాటల కోసం అన్నీ కోట్లు ఖర్చు పెట్టారా?
on Aug 5, 2023

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభమై రెండేళ్లు అవుతుంది. సినిమాలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ మినహా మరేదీ లేదు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ లేకపోవటంపై మెగా ఫ్యాన్స్ శంకర్ అండ్ టీమ్‌పై కాస్త గుర్రుగానే ఉన్నారు. సినిమా రిలీజ్ గురించి కూడా ఊసే బయటకు రావటం లేదు.
‘గేమ్ ఛేంజర్’ విషయంలో శంకర్ చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. సినిమా మేకింగ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే వరకు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వకూడదని గట్టిగానే నిర్ణయం తీసుకున్నట్టున్నారు మరి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి బయటకు వచ్చింది. అదేంటంటే సినిమాలో 5 పాటలున్నాయి. శంకర్ ప్రతీ పాటను ఓ వండర్‌గా తెరకెక్కించారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ మేరకు కేవలం సాంగ్స్ కోసమే రూ.100 కోట్లు ఖర్చు పెట్టారట. అంటే యావరేజ్‌గా ప్రతీ పాటకు రూ.20 కోట్లు ఖర్చు అయ్యింది.
శంకర్ ‘గేమ్ ఛేంజర్’ను పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో చరణ్ ముఖ్యమంత్రిగా ఓ పాత్రలో.. ఎన్నికల అధికారిగా మరో పాత్రలో కనిపించబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



