గద్దర్ అవార్డులకి ముహూర్తం ఖరారు.. ఈ సారి స్పెషల్ ఇదే
on Jan 19, 2026

-గద్దర్ అవార్డ్స్ హంగామ
-ఈ సారి ఎవరు అదృష్టవంతులు
-పీరియడ్ ఇదే
తెలుగు చలన చిత్రపరిశ్రమకి చెందిన మేకర్స్ , హీరో, హీరోయిన్స్ తో పాటు మొత్తం 24 క్రాఫ్ట్స్ లో సందడి వాతావరణం మొదలైంది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్(Gaddar Awards)అందుకు వేదిక కానుండగా గద్దర్ అవార్డ్స్ అందుకోవాలనే సినీ ఆశావాహులు కూడా పెరగనున్నారు. ఈ మేరకు గద్దర్ అవార్డ్స్ పై ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి అధికార ప్రకటన వచ్చింది. గద్దర్ అవార్డ్స్ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి.
2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు నిర్మించిన చిత్రాలకి గద్దర్ అవార్డ్స్ ఇవ్వనున్నారు.పరిశ్రమలోని 17 విభాగాలతో పాటు వ్యక్తిగత విభాగంలోను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టుగా ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ తెలియచేసింది. రేపటి నుంచి ఈనెల 31 వరకు దరఖాస్తులని .స్వీకరించనున్నట్టుగా అధికారకంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరి గద్దర్ అవార్డ్స్ ని అందుకొనే సినీ అదృష్టవంతులు ఎవరో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



