Home

»

Latest News

‘గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమం.!

Jul 22, 2026 4:56PM

నటుడు, 'గబ్బర్ సింగ్' ఫేమ్ రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రమేష్‌కు ప్రమాదకర స్థితిలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో, ఆయనను తక్షణమే హైదరాబాద్‌లోని ప్రముఖ అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చేర్పించారు.

ప్రస్తుతం అపోలో వైద్య బృందం అందించిన వివరాల ప్రకారం రమేష్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెదడుపై తీవ్ర ప్రభావం పడటంతో ఆయనను నిరంతర పర్యవేక్షణలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్'లో రమేష్ చేసిన పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులోని అంత్యాక్షరి ఎపిసోడ్ తో.. 'గబ్బర్ సింగ్' గ్యాంగ్ గా గుర్తింపు పొందారు. 

ఎంతో సరదాగా ఉండే నటుడు ఇలా హఠాత్తుగా తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరడం ఆయన కుటుంబ సభ్యులను, సన్నిహితులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

Pawan Kalyan, Gabbar Singh Ramesh, Brain Stroke, Apollo Hospita

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com