
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న'వారణాసి' పై వరల్డ్ సినీ ప్రేమికుల్లో ఉన్న అంచనాల గురించి చెప్పుకోవాలంటే మాటల్లో చెప్పుకోలేం. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి, ఇప్పుడు తన తదుపరి అద్భుత సృష్టి 'వారణాసి'తో గ్లోబల్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. రాజమౌళి తన యూరప్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రతిష్టాత్మక లా సినీమాథెక్ ఫ్రాంకైజ్ మరియు గ్లోబల్ యానిమేషన్ వేదిక అయిన అన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వారణాసి ప్రత్యేక గ్లింప్స్ ప్రదర్శించారు.
పారిస్ ఐకానిక్ థియేటర్‌లో 'వారణాసి: టు ది వరల్డ్' టైటిల్‌తో ప్రదర్శించిన ఈ ఫస్ట్ గ్లింప్స్ చూసి అక్కడి ఫ్రెంచ్ ప్రేక్షకులు స్క్రీన్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్ర పాత్రలో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వగానే థియేటర్ మొత్తం చప్పట్లు, ఈలలు, కేకలతో మార్మోగిపోయింది. వందలాది మంది విదేశీ ప్రేక్షకులు లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్‌కి నిదర్శనంగా నిలిచింది.
Also read: Rajinikanth: రజనీకాంత్, సీఎం విజయ్ వివాదంపై విష్ణు విశాల్ సంచలన వ్యాఖ్యలు
రీసెంట్ గా వారణాసి షూటింగ్ అప్ డేట్ పై రాజమౌళి అంతర్జాతీయ మీడియా సంస్థ 'కి కీలక అప్‌డేట్ ఇచ్చారు. చిత్రానికి సంబంధించిన ప్రధాన భాగం, ముఖ్యంగా అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్సులు అన్నీ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని, దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి వారణాసి షూటింగ్ పనులు పూర్తిగా ముగుస్తాయని రాజమౌళి స్పష్టం చేశారు. బాహుబలి తరహాలోనే విజువల్ వండర్‌గా రాబోతున్నవారణాసి ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 7, 2027 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. పారిస్‌లో వచ్చిన ఈ అద్భుతమైన రెస్పాన్స్ చూశాక, అసలు సినిమా థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే శక్తివంతమైన రోల్ లో కనిపిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. దాదాపు 1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా రికార్డు సృష్టించబోతోంది. అంతేకాదు, ఐమ్యాక్స్ (IMAX) 1.43:1 ఫార్మాట్‌లో చిత్రీకరించబడుతున్న మొదటి భారతీయ చిత్రం మరియు నాన్ ఇంగ్లీష్ చిత్రం ఇదే కావడం వారణాసి విశేషం.






