Home

»

Latest News

2021 డిసెంబ‌ర్ కేరాఫ్ స్పోర్ట్స్ డ్రామాస్!

Nov 17, 2021 3:48PM

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొంత‌కాలంగా స్పోర్ట్స్ డ్రామాల‌ హ‌వా న‌డుస్తోంది. ప‌లు భాష‌ల్లో ఈ త‌ర‌హా చిత్రాలు రూపొంద‌డ‌మే కాకుండా.. విజ‌య‌ప‌థంలోనూ ప‌య‌నిస్తున్నాయి. అలాగే, పుర‌స్కారాల‌ను సైతం కైవ‌సం చేసుకుంటున్నాయి. కాగా, ఒక్క 2021 డిసెంబ‌ర్ లోనే తెలుగు, హిందీ భాష‌ల్లో క‌లుపుకుని నాలుగు స్పోర్ట్స్ డ్రామాస్ తెర‌పైకి రానుండ‌డం వార్తల్లో నిలుస్తోంది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. డిసెంబ‌ర్ 10న కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో న‌టించిన తెలుగు చిత్రం `గుడ్ ల‌క్ స‌ఖి` థియేట‌ర్స్ లోకి రానుంది. ఇందులో కీర్తి షూట‌ర్ గా ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. ఇక డిసెంబ‌ర్ 24న వ‌రుణ్ తేజ్ టైటిల్ రోల్ లో న‌టించిన మ‌రో తెలుగు చిత్రం `గ‌ని` విడుద‌ల కానుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో బాక్స‌ర్ గా వినోదాలు పంచ‌నున్నాడు వ‌రుణ్.

స‌రిగ్గా అదే డిసెంబ‌ర్ 24న హిందీ చిత్రం `83` కూడా రిలీజ్ కానుంది. బ‌యోగ్రాఫిక‌ల్ స్పోర్ట్స్ డ్రామాగా ఎంట‌ర్టైన్ చేయ‌నున్న ఈ క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ లో క‌పిల్ దేవ్ గా ర‌ణ్ వీర్ సింగ్, క‌పిల్ శ్రీ‌మ‌తి రోమి భాటియాగా దీపికా ప‌దుకోణ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. నిజ‌జీవితంలో భార్యాభ‌ర్త‌లైన ర‌ణ్ వీర్, దీపిక‌.. తెర‌పైనా దంప‌తులుగానూ క‌నిపించ‌నుండ‌డం ఈ స్పోర్ట్స్ డ్రామాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంది. అదే విధంగా.. డిసెంబ‌ర్ 31న షాహిద్ క‌పూర్ న‌టించిన స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ` రిలీజ్ కానుంది. క్రికెట్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా.. మ‌న తెలుగు చిత్రం `జెర్సీ`కి హిందీ వెర్ష‌న్.  మ‌రి.. డిసెంబ‌ర్ నెల‌లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్న ఈ నాలుగు స్పోర్ట్స్ డ్రామాల్లో వేటికి ప్ర‌జాద‌ర‌ణ ద‌క్కుతుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com