ఒకే బాటలో కొణిదెల, అక్కినేని, దగ్గుబాటి, ఉప్పలపాటి స్టార్స్!
on Oct 27, 2021
2022 క్యాలెండర్ ఇయర్ తెలుగు సినీ ప్రియులకు ఎంతో స్పెషల్ కానుంది. ఎందుకంటే.. కొణిదెల, అక్కినేని, దగ్గుబాటి, ఉప్పలపాటి.. ఇలా ప్రముఖ సినీ కుటుంబాల నుంచి రెండు తరాల కథానాయకులు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేయనున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. `మగధీర`, `బ్రూస్ లీ`, `ఖైదీ నంబర్ 150` చిత్రాల్లో కాసేపు కలిసి కనిపించిన కొణిదెల తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానున్న `ఆచార్య` కోసం పూర్తి స్థాయిలో స్క్రీన్ షేరింగ్ తో వినోదాలు పంచనున్నారు. అలాగే `మనం` తరువాత `బంగార్రాజు` కోసం మరోసారి జట్టుకట్టిన అక్కినేని తండ్రీతనయులు కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య కూడా వచ్చే సంవత్సరం ఆరంభంలో సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయనున్నారు.
ఇక ఇప్పటివరకు కలిసి నటించని దగ్గుబాటి బాబాయ్ - అబ్బాయ్ విక్టరీ వెంకటేశ్, రానా.. వచ్చే ఏడాది ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతున్న `రానా నాయుడు` వెబ్ - సిరీస్ కోసం ఫస్ట్ టైమ్ జట్టుగా ఎంటర్టైన్ చేయనున్నారు. అదే విధంగా `బిల్లా`, `రెబల్` చిత్రాల్లో ఆకట్టుకున్న ఉప్పలపాటి వారి కథానాయకులు రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. `రాధే శ్యామ్`లో కొద్దిసేపు కలిసి వినోదాలు పంచనున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ పిరియడ్ రొమాంటిక్ సాగాలో పరమహంసగా అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నారు అతని పెదనాన్న కృష్ణంరాజు.
మరి.. సేమ్ పాథ్ లో వెళుతున్న కొణిదెల, అక్కినేని, దగ్గుబాటి, ఉప్పలపాటి స్టార్స్.. `ఫ్యామిలీ కాంబో` హిట్స్ ని అందుకుంటారేమో చూడాలి.
Also Read