Home

»

Latest News

ఫిల్మ్ ఫేర్ పై ఫైర్ అవుతున్నారు

Jun 5, 2015 2:31PM

త‌మ ఫేవ‌రేట్ హీరో సూప‌ర్బ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చినా..  ఓ అవార్డు క‌మిటీ  నామినేష‌న్‌కి సైతం క‌న్సిడ‌రేష‌న్ చేయ‌లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాస్తంత వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌ల ఫిల్మ్ ఫేర్ సంస్థ 2014కి గానూ 'బెస్ట్' కేట‌గిరిల‌ను రిలీజ్ చేసింది. వీటిలో 'బెస్ట్ యాక్ట‌ర్' కేట‌గిరిలో గ‌తేడాదికి గానూ ఇద్ద‌రు పాపుల‌ర్ హీరోలు నామినేట్‌ కాలేదు. '1 నేనొక్క‌డినే' కోసం బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన త‌మ అభిమాన క‌థానాయ‌కుడు మ‌హేష్‌బాబుని ఫిల్మ్ ఫేర్ నిర‌క్ష్యం చేసిందంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ ఓ వైపు.. 'లెజెండ్' కోసం సూప‌ర్బ్ యాక్టింగ్ చేసిన త‌మ ఫేవ‌రేట్ హీరో బాల‌కృష్ణ ని బెస్ట్ యాక్ట‌ర్ కేట‌గిరిలో స్థాన‌మివ్వ‌లేదంటూ బాల‌య్య అభిమానులు మ‌రో వైపు ఫిల్మ్ ఫేర్ పై ఫైర్ అవుతున్నారు.  ఫిల్మ్ ఫేర్ ఏ ఏ కార‌ణాల‌తో ఈ స్టార్ హీరోల‌ని ప‌ట్టించుకోలేదో కానీ.. ఇప్పుడు ఫ్యాన్స్  ఫైరింగ్  మాత్రం ఆ సంస్థ‌ని ఇబ్బంది పెడుతుందంటూ క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com