Home

»

Latest News

Raaka: రాకాలో ఛాన్స్ కొట్టేసిన అల్లు అర్జున్ వీరాభిమాని

Jun 1, 2026 5:25PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కుతున్న 'రాకా' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటూ ఉంది.  హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్‌తో  తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు నిత్యం 'రాకా' ఎలా ఉండబోతోందని మాట్లాడుకుంటూ ఉన్నారు

 ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి మలయాళ బ్యూటీ 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్(Femina George)ఎంటర్ అయ్యింది. ఈ విషయాన్నీ తన ప్రస్తుత మూవీ 'కరక్కం' ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫెమినా స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ' 'రాకా' లాంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నేను  భాగమవుతానని అసలు ఊహించలేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికంటే ఇది అత్యంత భారీ చిత్రం. నా లేటెస్ట్మూవీ 'డిస్కో' షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి రాగానే 'రాకా' సినిమా ఆడిషన్ టీమ్ నుండి మెసేజ్ రావడం, ఆ తర్వాత ఈ అద్భుతమైన ఛాన్స్ దక్కడం అంతా ఒక కలలా జరిగిపోయింది.

Also read: lokesh kanagaraj: ఇంకెప్పుడు  లోకేష్.. వైరల్ గా మారిన లైనప్ 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటం  నా  జీవితంలో మర్చిపోలేని గొప్ప క్షణమని ఫెమినా ఆనందం వ్యక్తం చేసింది. తాను చిన్నతనంలో చూసిన మొదటి మూవీ  2006లో విడుదలైన 'హ్యాపీ'. ఆ సినిమా చూసినప్పటి నుంచే  అల్లు అర్జున్‌కి  వీరాభిమానిగా మారిపోయాను. నా క్యారక్టర్ నిడివి కాస్త చిన్నదైనప్పటికీ, కథా పరంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ అని తెలిపింది.
  

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com