Home

»

Latest News

NTR: ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక్కడినే తినేవాడిని.. తాతగారి వల్లే తిండి పిచ్చి పట్టుకుంది!

Apr 14, 2026

నందమూరి తారక రామారావు (NTR) మనవడిగా సినీ పరిశ్రమకు పరిచయమై, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). తాత ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఎంతో గౌరవం, అభిమానం. తన తాత నుంచి తారక్ ఎన్నో అలవాట్లు నేర్చుకున్నారు. ముఖ్యంగా తనకి తిండి పిచ్చి తాత వల్లే పట్టుకుందని గతంలో జయప్రదం టాక్ షోలో తారక్ చెప్పడం విశేషం. 

తాతతో అనుబంధం - ఆహారపు అలవాట్లు
జూనియర్ ఎన్టీఆర్ తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ, చిన్నప్పుడు తనకు అన్నం తినడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదని, రెండు ముద్దలు తింటేనే వాంతులు అయ్యేవని గుర్తు చేసుకున్నారు. అయితే, ఆయన ఆహారపు అలవాట్లు తాతయ్య ఎన్టీఆర్ ను చూశాకే పూర్తిగా మారిపోయాయి. తాతయ్య ఇడ్లీలను నెయ్యిలో ముంచి ఎంతో ఇష్టంగా తినడం చూసి, తనకు కూడా తిండి మీద ఆసక్తి పెరిగిందని చెప్పారు. ఆ తర్వాత తనకు "తిండి పిచ్చి" పట్టుకుందని, ఎంతగా అంటే హైదరాబాద్‌లోని బావర్చి బిర్యానీలో నలుగురు తినే 'ఫ్యామిలీ ప్యాక్' బిర్యానీని ఒక్కడినే సింగిల్ సిట్టింగ్ లో తినేసేవాడినని తారక్ సరదాగా వెల్లడించారు.

బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్
సినిమా రంగంలోకి ప్రవేశించిన కొత్తలో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండేవారు. కానీ, హీరోగా తనను తాను మలుచుకుంటూ వచ్చారు. ముఖ్యంగా 'యమదొంగ' సినిమా సమయానికి ఆయన అద్భుతమైన మేకోవర్ అయ్యారు. తన ఆహారపు అలవాట్లను నియంత్రించుకుంటూ, కఠినమైన వ్యాయామాలు చేసి సుమారు 20 కిలోల బరువు తగ్గారు. ఆ తర్వాత వచ్చిన 'టెంపర్', 'అరవింద సమేత' వంటి సినిమాల్లో సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. 

జూనియర్ ఎన్టీఆర్ తన తాతయ్య నుంచి కేవలం నట వారసత్వాన్నే కాకుండా, క్రమశిక్షణను, కష్టపడే తత్వాన్ని కూడా పుణికిపుచ్చుకున్నారు. భోజన ప్రియుడైన ఆయన, అవసరమైనప్పుడు తన శరీరాన్ని సినిమా పాత్ర కోసం ఎలాగైనా మలుచుకోగలరని నిరూపించారు. సినిమా సినిమాకి అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ తో మెప్పిస్తున్నారు. తన రాబోయే చిత్రం 'డ్రాగన్'లో కూడా లీన్ అండ్ షార్ప్ లుక్ లో కనిపించి సర్‌ప్రైజ్ చేయనున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com