తెలుగు హీరోయిన్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్! స్పందించిన హీరోయిన్
on Jun 25, 2025

ఇమ్రాన్ హష్మీ, రణదీప్ హుడా హీరోలుగా తెరకెక్కిన 'జన్నత్ 2 'ద్వారా హీరోయిన్ గా హిందీ చిత్ర రంగానికి పరిచయమైన నటి' ఈషా గుప్తా'(Esha Gupta). ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈషా తెలుగులో రామ్ చరణ్(Ram Charan)బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన 'వినయ విధేయ రామ' లో 'ఏక్ బార్ ఏక్ బార్ సాంగ్' లో శరణ్య అనే రోల్ లో గెస్ట్ అప్పీరియన్సు ఇచ్చింది. 'వీడెవడు' అనే మరో తెలుగు చిత్రంలో కూడా చేసింది. ప్రముఖ క్రికెటర్ 'హార్దిక్ పాండ్యా'(Hardik pandya)తో ఈషా డేటింగ్ లో ఉన్నట్టుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈషా మాట్లాడుతు 'హార్దిక్ తో నేను డేటింగ్ చెయ్యలేదు. కొన్ని నెలల పాటు మేము మాట్లాడుకున్నాం. మా మధ్య మాటలు మొదలైనప్పుడు డేటింగ్ చెయ్యవచ్చు లేదా చెయ్యకపోవచ్చని ముందే ఫిక్స్ అయ్యాం. కానీ మా ఇద్దరి మధ్య మంచి అనుబంధంతో పాటు స్నేహం ఏర్పడింది. . అయితే రిలేషన్ లో అడుగుపెట్టకముందే విడిపోయాం. రెండు మూడుసార్లు మాత్రమే కలిసాం. ఆ తర్వాత అది ముగిసిపోయిందని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈషా చెప్పిన మాటలతో హార్దిక్ తో డేటింగ్ విషయాలకి పుల్ స్టాప్ పడినట్లయింది.
2019 తర్వాత ఎలాంటి చిత్రాల్లో కనిపించని ఈషా, ప్రస్తుతం 'దేశి మేజిక్' అనే మూవీలో చేస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



