Home

»

Latest News

జూన్ 29 న రామ్, తమన్నాల ఎందుకంటే

Jun 26, 2011 5:15PM

జూన్ 29 న రామ్, తమన్నాల "ఎందుకంటే" ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే స్రవంతి మూవీస్ పతాకంపై, చురుకైన యువ హీరో రామ్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రం"ఎందుకంటే...!". ఈ "ఎందుకంటే" సినిమాలో తమన్నా భాటియానే హీరోయిన్ గా నటిస్తూందని తెలుగువన్ ముందే తెలిపింది. కారణం ఒక ఇంటర్వ్యూలో తమన్నా "రామ్ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నాను" అని తెలిపింది.

ఈ రామ్, తమన్నాల "ఎందుకంటే" సినిమాకి రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రామ్, తమన్నాల "ఎందుకంటే" సినిమా తాలూకు నాలుగైదు పాటలకు ట్యూన్లు సిద్ధమయ్యాయట. రామ్, తమన్నాల "ఎందుకంటే" సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రామ్, తమన్నాల "ఎందుకంటే" చిత్ర దర్శకుడు కరుణాకరన్ గతంలో "తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా" వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com