Home

»

Latest News

మహేష్ బాబు దూకుడు విశేషాలు

May 2, 2011 9:13AM

మహేష్ బాబు "దూకుడు" విశేషాలు ఇలా ఉన్నాయి. ఫోర్టీన్ రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, "ఏమాయ చేసావే, బృందావనం" చిత్రాల్లో నటించిన సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మిస్తున్నచిత్రం"దూకుడు". మహేష్ బాబు "దూకుడు" చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతూంది. చార్మినార్, చిరాన్ ఫోర్ట్, అల్యుమినియం ఫ్యాక్టరీ తదితర ప్రాంతాల్లో మహేష్ బాబు "దూకుడు" చిత్రం షూటింగ్ "మే" ఏడవ తేదీ వరకూ జరుగుతుంది. ఆ తర్వాత "మే" పదవ తేదీ నుండి "మే" ఇరవై ఆరవ తేదీ వరకూ స్విట్జర్ల్యాండ్ లోనూఈ చిత్రం షుటింగ్ జరుగుతుంది. అక్కడ మహేష్ బాబు, సమంత ఇతర ముఖ్య తారాగణం పాల్గొనే సీన్లనూ, పాటలనూ చిత్రీకరిస్తారు.

అనంతరం "మే" ఇరవై ఆరు నుండి జూన్ ఎనిమిది వరకూ హైదరాబాద్ లో మహేష్ బాబు "దూకుడు" చిత్రం షూటింగ్ జరుగుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.ఇటీవల జరిగిన సినీ కార్మికుల సమ్మెవలన మహేష్ బాబు "దూకుడు" చిత్రం కోసం ఇచ్చిన సమంత, ప్రకాష్ రాజ్ ల డేట్లు అనవసరంగా వృధా అయ్యాయి. దానివల్ల ఈ మహేష్ బాబు "దూకుడు" చిత్రం అనివార్యంగా ఆలస్యం అవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com