
పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రైమ్ కామెడీ చిత్రం 'దొంగ నా కొడుకు' (డీఎన్‌కే). లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి హీరో,సుష్మిత శెట్టి హీరోయిన్.శ్రీను కంబాల దర్శకత్వం వహించాడు.
బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల గణాంకాల ప్రకారం, 'దొంగ నా కొడుకు' మొదటి రోజు 2.15 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 964 షోలలో ప్రదర్శించగా, ప్రతి షోకు సగటున 19,191 వసూలు కావడం విశేషం. మొదటి రోజు మొత్తం 1,67,626 మంది ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చి వీక్షించారు.
అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ ఈ చిన్న చిత్రం మంచి స్పందన తెచ్చుకుంది. విడుదల రోజు ఉదయం 6 గంటల సమయానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 76,475 టికెట్లు అమ్ముడవ్వగా, 92.50 లక్షల గ్రాస్ వసూలైంది.
.webp)
ఇది కూడా చదవండి:ఇట్లు అర్జున ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!
ఉదయం షోలకు 29 శాతం ఆక్యుపెన్సీతో మొదలై మధ్యాహ్నం షోలకు ఏకంగా 47 శాతానికి, సాయంత్రం షోలకు 46 శాతానికి చేరుకుంది. రోజువారీ సగటు ఆక్యుపెన్సీ 41 శాతంగా నమోదై, మౌత్ టాక్ బలంగా ఉందని నిరూపించింది.ప్రాంతాల వారీగా కలెక్షన్లను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచే సింహభాగం వసూళ్లు వచ్చాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు 2.00 కోట్ల గ్రాస్ వసూలైంది, ఇది మొత్తం కలెక్షన్లలో 93 శాతానికి సమానం. కర్ణాటకలో ₹15 లక్షల గ్రాస్ నమోదైంది. నగరాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో 189 షోలతో పాటు, విశాఖపట్నం (64 షోలు), విజయవాడ (54 షోలు) ప్రాంతాల్లో మధ్యాహ్నం మరియు రాత్రి షోలకు 50 నుండి 73 శాతం వరకు అద్భుతమైన ఆక్యుపెన్సీ కనిపించింది.
మీకు నచ్చవచ్చు: దొంగ నాకొడుకు రివ్యూ
మీకు నచ్చవచ్చు:టాలీవుడ్ నెక్స్ట్ నెంబర్ వన్ అనశ్వర రాజనేనా!
[Donga Naa Koduku,Sushmitha Shetty, Mouli Tanuj Prasanth, Mythri Movie Makers, srinu Kambala]






