Home

»

Latest News

Mrunal Thakur: ఓటీటీలోకి క్రేజీ రొమాంటిక్ డ్రామా.. సిద్ధాంత్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ అదిరిపోయింది!

Mar 27, 2026

నార్త్ తో పాటు సౌత్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'దో దీవానే షహర్ మే'. విభిన్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ కానుంది. (Do Deewane Seher Mein)

ఈ చిత్ర కథాంశం ఒక మెట్రో సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నేటి తరం యువతలో ఉండే ఇన్ సెక్యూరిటీస్, కెరీర్ ఒత్తిళ్లు, నిజమైన ప్రేమ కోసం వారు పడే తపనను దర్శకుడు రవి ఉద్యావర్ చాలా సహజంగా చూపించాడు. సిద్ధాంత్ చతుర్వేది ఇందులో ఒక అమాయకమైన, నత్తి సమస్యతో ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అద్భుతంగా నటించాడు.  మృణాల్ ఠాకూర్ తనదైన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది తొలిసారి జంటగా నటించినప్పటికీ, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరాయి. 

జీ స్టూడియోస్ తో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఈ మూవీ ఓటీటీ విడుదల ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి రానుంది.

థియేటర్లలో కంటే ఓటీటీలో ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీలకు ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారు. పైగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో రొమాంటిక్ డ్రామాలకు మంచి ఆదరణ ఉండటంతో, 'దో దీవానే షహర్ మే' కచ్చితంగా మంచి వ్యూయర్ షిప్‌ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 

కథేంటంటే..
శశాంక్ (సిద్ధాంత్ చతుర్వేది) ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అతను తెలివైన వాడైనప్పటికీ, నత్తి సమస్యతో బాధపడుతుంటాడు. దాంతో పబ్లిక్ లో మాట్లాడటానికి  కూడా భయపడుతుంటాడు. మరోవైపు రోష్ని (మృణాల్ ఠాకూర్) ఒక కంటెంట్ క్రియేటర్. ఆమెలో కూడా తాను అందంగా లేనని ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. అలాంటి వీరిద్దరూ కలుస్తారు. వీరి ప్రేమ కథ ఏంటి? ఆ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కిందా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com