బాబాయ్..అబ్బాయ్‌లు ఎలా వచ్చారో తెలుసా..?
on Oct 31, 2016
ఈ దీపావళి టాలీవుడ్‌కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటారా..? ఇండస్ట్రీలోని పెద్ద హీరోలందరూ ఖాళీ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు సినిమాలు చేస్తూ అభిమానులకు వినోదాల విందు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళిని పురస్కరించుకుని ఈ హీరోలందరూ ఫస్ట్‌లుక్‌లు, పోస్టర్లు, టీజర్లు రిలీజ్ చేసి సందడి చేశారు. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి దివాళికి ఒకరోజు ముందే తన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయగా.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ "కాటమరాయుడు" ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఆ వెంటనే అబ్బాయి రాంచరణ్ తను నటిస్తున్న "ధ్రువ" పోస్టర్ని వదిలాడు.
మెగాస్టార్ ఫస్ట్‌లుక్‌ని పక్కనబెడితే..బాబాయి, అబ్బాయిల పోస్టర్స్పైనే మెగా అభిమానులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ సైకిల్ మీద వస్తే..అబ్బాయి రాంచరణ్ బుల్లెట్ మీద రావడం ఈ చర్చకు కారణం. సోషల్ మీడియాలో దీనిపై డిష్కస్ చేసుకుంటూ బాబాయ్ సైకిల్..అబ్బాయ్ బుల్లెట్ అనే కామెంట్స్ పెడుతున్నారు. ఇక కాటమరాయుడు వచ్చే ఏడాది మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా..రాంచరణ్ ధ్రువ ఈ ఏడాది డిసెంబర్ 2న రిలీజ్ కానుంది.