Home

»

Latest News

మ‌రో స్టార్ హీరో సినిమాలో అల్ల‌రి న‌రేష్

Jun 7, 2019 4:19PM

 

`మ‌హ‌ర్షి`లో మ‌హేష్ ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించి మంచి మార్కులు కొట్టేసాడు అల్ల‌రి న‌రేష్‌.  సినిమాకు న‌రేష్ క్యార‌క్ట‌ర్ ఇంపార్టెంట్ కావ‌డం, భావోద్వేగాల‌తో నిండిన పాత్ర కావ‌డంతో మ‌హ‌ర్షి  సినిమా న‌రేష్ కు మంచి పేరు తెచ్చింది.  ఇక దీంతో ఇప్పుడు న‌రేష్ పై ద‌ర్శ‌క నిర్మాత‌లు దృష్టి సారించారు. త‌మ సినిమాలో న‌రేష్ కోసం పాత్ర‌లు క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మ‌రో స్టార్ హీరో సినిమాలో న‌రేష్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. అవును ప్ర‌జంట్ మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తోన్న `డిస్కోరాజా`ఓ లో ఒక ఇంపార్టెంట్ క్యార‌క్ట‌ర్ కోసం ఇటీవ‌ల న‌రేష్ ని సంప్ర‌దించార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. న‌రేష్ కి త‌న క్యార‌క్టర్ ని నేరేట్ చేసాడ‌ట ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లో ఒక డెసిష‌న్ తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది. న‌రేష్ ఈ సినిమాక గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే ర‌వితేజ్ తో `శంభో శివ శంభో` త‌ర్వాత చేసే రెండో సినిమా అవుతుంది.   

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com