దివాళీ రేసులో కార్తిక్!
on Sep 10, 2023
దీపావళి రేసులోకి డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఎంట్రీ ఇస్తున్నారు. పేట్ట, పిజ్జా, మహాన్ లాంటి సినిమాలతో డైరక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నారు కార్తిక్ సుబ్బరాజ్.ఆయన దర్శకత్వం వహించిన రెండో సినిమా జిగర్తండ. ఈ సినిమాకు అప్పట్లో విపరీతమైన పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. యాక్షన్ కామెడీగా తెరకెక్కింది జిగర్తండ. సిద్ధార్థ్, బాబీ సింహా, గురు సోమసుందరం కీ రోల్స్ చేశారు. డార్క్ యాక్షన్ కామెడీగా తెరకెక్కింది జిగర్తండ. అప్పటిదాకా తమిళ్ ఆడియన్స్ కి తెలియని జోనర్ అని రివ్యూల్లోనూ రాశారు. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తామని డైరక్టర్ ప్రకటించినప్పటి నుంచి మంచి క్రేజ్ ఉంది. అ సినిమాలో రాఘవ లారెన్స్ కీ రోల్ చేశారు.
జిగర్తండ సీక్వెల్ ని నవంబర్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. అదే టైమ్‌కి కరణ్ భూలాని థాంక్యూ కూడా విడుదలవుతుంది. జిగర్తండ సీక్వెల్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. రిలీజ్ డేట్‌కి సంబంధించి మూడు సినిమాల వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. జిగర్తండ టీజర్‌ని సెప్టెంబర్ 11వతేదీ మధ్యాహ్నం 12.12కి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు కార్తిక్ సుబ్బరాజ్.
ఆల్రెడీ దీపావళి రేసులో కార్తి సినిమా ఉంది. తమిళనాడులో దీపావళి పండుగను చాలా బాగా చేసుకుంటారు. మన దగ్గర సంక్రాంతి, దసరాకు సినిమాలు థియేటర్లలో పోటీపడ్డట్టు తమిళనాడులో దీపావళికి సినిమాలు పోటీపడుతుంటాయి. జిగర్తాండ లాంటి సినిమాకు కరెక్ట్ సీజన్ కుదిరింది అని అంటున్నారు కోలీవుడ్ క్రిటిక్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



