Home

»

Latest News

బాలచందర్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

Apr 29, 2011 6:38PM

బాలచందర్ కి "దాదా సాహెబ్ ఫాల్కే" అవార్డు లభించింది. వివరాల్లోకి వెళితే సత్తెకాలపుసత్తెయ్య, అంతులేని కథ, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మరోచరిత్ర వంటి అద్భుతమైన వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి, రజనీ కామత్, కమల్ హాసన్, జయప్రద వంటి ప్రముఖ నటీనటులెందరికో సినీ రంగంలో తొలిసారిగా అవకాశాలను కల్పించిన దర్శకశ్రేష్టుడు కె.బాలచందర్‍ కు భారత ప్రభుత్వం సినీ రంగంలోని ప్రముఖులకు అందించే ప్రతిష్టాత్మక "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు"ని 2011 వ సంవత్సరానికి గాను అందించనుంది.

ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ఏప్రెల్ 29 వ తేదీన ప్రకటించింది. ఈమధ్యే ఎ.యన్.ఆర్. అవార్డుని కె.బాలచందర్ అందుకున్నారు. ఇప్పుడాయనకు "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు" కూడా రావటం చాలా సంతోషదాయకమని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ప్రకటించారు. నిజానికి ఆయనకీ "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు" ఎప్పుడో రావలసింది. ఈ అవార్డు రావటం ఆలస్యంగానైనా రావటం చాలా ఆనందకరమైన విషయంగా చెప్పవచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com