Home

»

Latest News

'ఏజెంట్'లో 'ది గాడ్'గా బాలీవుడ్ యాక్టర్!

Apr 14, 2023 4:55PM

యంగ్ హీరో అఖిల్ అక్కినేని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య కనిపిస్తుండగా,  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా ఏజెంట్ నుంచి డినో మోరియాను  'ది గాడ్' గా పరిచయం చేశారు. 

రాజ్, అక్సర్, జూలీ మొదలైన చిత్రాలలో నటించి పేరుపొందిన బాలీవుడ్ యాక్టర్ డినో మోరియా ఏజెంట్ సినిమాలో 'ది గాడ్' గా అలరించనున్నాడు. తాజాగా ఆ పాత్రకు సంబంధించిన లుక్ ని రివీల్ చేస్తూ పోస్టర్ ను వదిలారు. చేతిలో మెషిన్ గన్‌తో పోస్టర్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. అతని పొడవాటి జుట్టు, నెరిసిన గడ్డం , ముఖం మీద గాయాలు ఈ పాత్రను మరింత డెడ్లీ గా ప్రజెంట్ చేస్తున్నాయి.  

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com