Home

»

Latest News

Dimple Hayathi: మెగాస్టార్ కి విలన్ గా డింపుల్ హయతి

Apr 22, 2026

 మనలో మన మాట.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)సినిమాలో ఆఫర్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. తనకి ఆఫర్ వచ్చిందనే విషయం తెలియగానే ఎగిరి గంతేస్తారు. ఇప్పుడు ఆ పని డింపుల్ హయతి(Dimple Hayathi)చేసిందేమో అనే డౌట్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే చిరంజీవి, బాబీ మూవీలో డింపుల్ హయతి ఉందనేది సినీ ఇండస్ట్రీ టాక్.

కాకపోతే  నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతుందని, సదరు క్యారక్టర్ చిరుని ఢీకొట్టే క్యారక్టర్ అని టాక్. మరి ఇప్పటి వరకుహీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న డింపుల్ మెగా, బాబీ మూవీతో కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నట్టే. మొన్న సంక్రాంతికి రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి తో డింపుల్ మెప్పించిన విషయం తెలిసిందే      'కాకాజీ' అనే టైటిల్ ని మెగాస్టార్ అండ్ టీం పరిశీలిస్తున్నట్లు సమాచారం.


also read:  Chandoo Mondeti: చందు మొండేటి దర్శకత్వంలో బడా హీరోలు.. బిగ్గెస్ట్ మల్టిస్టారర్ 

  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com