
డింపుల్ హయతి.. కమర్షియల్ చిత్రాల్లో ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి అభిమానులని, ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో స్పెషలిస్ట్. ప్రీవియస్ చిత్రం రవితేజతో కలిసి చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి లో చూడచక్కని నటన ప్రదర్శించింది.ఇప్పుడు ఈ అమ్మడు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భరత నాట్యం చేసి అభిమానులని, భక్తులని ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి: పుష్ప అంటే ఇంతేగా: సుకుమార్ కి జాతీయ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందన
సాధారణంగా వెండితెరపై నటనతో, గ్లామర్‌తో అలరించే టాలీవుడ్ కథానాయికలను సినీ తెరపై చూస్తుంటాం. కానీ తిరుమల నాదనీరాజనం వేదికపై ఒక తెలుగు హీరోయిన్ పూర్తి సాంప్రదాయ దుస్తుల్లో, అద్భుతమైన భావాభినయంతో చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యానందాలకి లోనయ్యారు. తిరుమలలో బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో, సాయంత్రం నాదనీరాజనం మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో డింపుల్ హయాతి స్వామివారి సేవలో భాగమయ్యారు. శ్రీనివాసుడి దివ్య సన్నిధిలో తనలోని సాంప్రదాయ నాట్య కళను ఆవిష్కరిస్తూ ఆమె చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఏడుకొండల పాదాల చెంత ప్రదర్శన ఇచ్చిన 'డింపుల్ హయతి' జన్మ ధన్యమయ్యిందని చెప్పవచ్చు.










