Home

»

Latest News

బాలీవుడ్ లెజెండ్ దిలీప్‌కుమార్‌కు అస్వస్థత

Dec 7, 2016 9:05AM

అలనాటి బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుడికాలు వాపు రావడం, బాగా జ్వరం కూడా రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబై లీలావతి ఆస్పత్రికి తరలించారు. 1922లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించిన ఆయన అసలు పేరు యూసుఫ్‌ఖాన్. ఆయన తండ్రి ఒక పండ్ల వ్యాపారి, తండ్రితో అస్సలు పడకపోవడంతో ఇంటినుంచి పారిపోయిన ఆయన పుణేకు చేరుకుని తన పేరును దిలీప్‌కుమార్‌‌గా మార్చుకుని జ్వర్ భట చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు తన నటనతో అభిమానులను అలరించి ట్రాజెడీ కింగ్‌గా ఖ్యాతి గడించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్‌ అవార్డులతో సత్కరించింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com