Home

»

Latest News

అరవింద్ వన్ మ్యాన్ షో..!

Dec 9, 2016 2:12PM

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ధృవ ఇవాళ ధియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే మార్నింగ్ షో పడిపోవడంతో టాక్ బయటకు వస్తోంది. సినిమా చూసినవాళ్లందరూ పర్వాలేదు అంటున్నారు. చరణ్ చాలా కొత్తగా ఉన్నాడని అలా కనిపించేందుకు ఎంతో శ్రమించాడని సగటు ప్రేక్షకుడి మనసులో మాట. అలాగే సినిమా ప్లస్‌లు, మైనస్‌లు మాట్లాడుకోవడం కామన్..అలాంటి మాటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా విలన్ అరవింద్ స్వామి గురించి. స్టైలిష్ అండ్ ఇంటెలిజెంట్ విలన్‌గా అరవింద్ నటన సూపర్భ్‌అట.. ఎక్కడా అతి లేకుండా సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచాడట స్వామి. సినిమా చూసిన ప్రతిఒక్కరిని అరవింద్ పాత్రే వెంటాడుతుంది. అంత చక్కగా హావభావాలు పలికించాడు. సో..టాలీవుడ్‌కి అరవింద్ స్వామి రూపంలో మరో స్టైలిష్ విలన్‌ దొరికాడన్నమాట. ఈ దెబ్బతో స్వామికి ఆఫర్ల వరద ఖాయం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com