Home

»

Latest News

పవన్‌ని అంత మాటన్నాడా..?

Dec 8, 2016 1:29PM

అభిప్రాయాలు, మనస్తత్వాల పరంగా చిరు, పవన్ కళ్యాణ్‌లు భిన్నధ్రువాలు. రాజకీయ పరంగా మేమిద్దరం వేరైనా అన్నదమ్ములుగా మేమిద్దరం ఒకటే అని పవన్, చిరులు చాలా సందర్భాల్లో ప్రకటించారు. అయితే చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో వీలినం చేసిన తర్వాత అన్నయ్యతో దూరం జరిగారు పవన్. ఆ గ్యాప్ లాంగ్ టైమ్ కంటిన్యూ అయ్యింది. ఈ క్రమంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఆ దూరాన్ని దగ్గర చేసింది. ఇద్దరూ మళ్లీ ఒక్కటిగా కనిపించారు. కానీ మెగా వారసులు మాత్రం పవన్‌తో అంత సన్నిహతంగా ఉండేలా కనిపించడం లేదు. బన్నీ, పవన్ కోల్డ్‌వార్ మెగా అభిమానుల్లో చర్చకు దారి తీసింది. తాజాగా పవన్‌పై రామ్‌చరణ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి .

ఇంట్లో కానీ బయట కానీ పవన్‌ని "బాబాయ్" అని సంభోదించే చెర్రీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు అని సంభోదించడం చర్చనీయాంశమైంది. "ధృవ" ప్రమోషన్స్‌లో భాగంగా చెర్రీ మీడియాతో ఈ సినిమా విశేషాలు పంచుకుంటున్నాడు. ఆ సమయంలో గత కొన్నాళ్లుగా "పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌ " బ్యానర్‌లో మీరు నెక్స్ట్ మూవీ చేస్తున్నారా అని జర్నలిస్ట్‌లు అడిగారు. అందుకు స్పందించిన చరణ్..పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసుకునే క్రమంలో బిజీగా ఉన్నారు, అవి పూర్తయిన తర్వాతే ఆయన బ్యానర్‌లో సినిమా ఉంటుందని అన్నాడు. ఎప్పుడూ "బాబాయ్" అనే పిలిచే చోట బయటి వ్యక్తిని పిలిచినట్లుగా పేరు పెట్టి పిలవడం మీడియా మిత్రులను ఆశ్చర్యంలో ముంచెత్తింది..ఈ విషయం ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com