
తమిళంలో తన విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ సెన్సేషన్ ధ్రువ్ విక్రమ్.. ఇప్పుడు తన సరికొత్త లైనప్‌తో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందులో భాగంగానే రూపొందుతున్న భారీ ద్విభాషా చిత్రం 'DV4'.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ బైలింగువల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ప్రేమికుల్లో, ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'రాక్షసుడు', 'ఖిలాడి' వంటి హై-వోల్టేజ్ మాస్ అండ్ థ్రిల్లర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ ప్రాజెక్ట్‌ను శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా, పెన్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న మేకర్స్, అక్టోబర్ 2026 నాటికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించడానికి సమాయత్తమవుతున్నారు.
సెప్టెంబర్ 23న ధ్రువ్ విక్రమ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ తో పాటు, సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
మరోవైపు ధ్రువ్ విక్రమ్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. కరణ్ అరవింద్ కుమార్ ఆ చిత్రానికి దర్శకుడు.
[DV4 Movie, Dhruv Vikram, Ramesh Varma, Sri Neeladri Productions, Pen Studios, Tamil Telugu Bilingual, Telugu Film News, Telugu News






