'వాతి' కమింగ్.. టీజర్ వచ్చేస్తోంది!
on Jul 25, 2022

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం 'సార్'(తమిళ్ లో 'వాతి'). తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ డైరెక్ట్ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
మాములుగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన కొన్ని రోజులకి టీజర్ ని విడుదల చేస్తుంటారు. కానీ 'సార్' మూవీ టీమ్ మాత్రం కేవలం ఒక్క రోజు తేడాతో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది. జులై 27న ఫస్ట్ లుక్, జులై 28న టీజర్ ని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను వదిలారు. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి.. ధనుష్ ని ఎలా చూపించబోతున్నాడోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి కుమార్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



