తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రముఖ కమెడియన్ వడివేలు కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలు కోలీవుడ్‌లో చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. కొంతకాలం ఇద్దరూ కలిసి సినిమాలు చేయకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇప్పుడు ఎట్టకేలకు వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధనుష్‌తో తనకున్న విభేదాలపై వడివేలు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.
ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన 56వ సినిమాను ‘లబ్బర్ పందు’ ఫేమ్ దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రస్తుతానికి ‘D56’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ వేడుకకు ధనుష్‌తో పాటు సినిమాలో నటిస్తున్న పలువురు కీలక నటీనటులు హాజరయ్యారు. వారిలో వడివేలు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా గతంలో ధనుష్‌తో వచ్చిన గొడవ గురించి వడివేలు స్పందించినట్లు సమాచారం. తమ ఇద్దరి మధ్య అపార్థాలు రావడానికి ఓ మూడో వ్యక్తి కారణమయ్యాడని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అతడి కారణంగానే తాము ఒకరిపై ఒకరు అపార్థం చేసుకున్నామని, దాంతో కొంతకాలం దూరంగా ఉన్నామని వడివేలు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ విషయాలను పక్కన పెట్టి ధనుష్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం.
గతంలో ధనుష్, వడివేలు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు D56లో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాలో ఎస్.జే. సూర్య, ప్రీతి ముకుందన్, విజయ్ బి. కుమార్ తదితరులు కూడా నటిస్తున్నారు. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు.
ఇక D56 చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ధనుష్ ప్రస్తుతం ‘ఓం’తో పాటు మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
[Dhanush, Vadivelu, Dhanush Vadivelu Issue, Dhanush Vadivelu Fight, Dhanush D56, D56 Movie, Dhanush 56th Movie, Vadivelu Latest News, Dhanush Movies, Tamil Cinema, Tamil Movies, Tamizharasan Pachamuthu, Dhanush Vadivelu Reunion]






