
హీరోల యందు స్టార్ హీరోలు వేరయా అనే రీతిలో స్టార్ హీరోల సినిమా వచ్చిందంటే చాలు బాక్స్ ఆఫీస్ తో పాటు ఎంతో మంది కళకళలాడుతూ ఉంటారు. అసలు స్టార్ హీరోలు నాలుగు నెలలకి ఒక సినిమా చేసినా చాలు ఇండియా మొత్తం సుభిక్షంగా ఉంటుందనే సూత్రాన్ని అయితే సినీ ప్రియులు చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. మరి అలాంటి స్టార్ హీరోలు రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి వెళ్తుండటం చర్చినీయాంశమయ్యింది.
ధనుష్, రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓమ్' (గతంలో D55) చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్షక లోకంలో భారీ అంచనాలను నెలకొల్పింది. సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2 నిమిషాల 32 సెకన్ల విజువల్స్ నిండిన టీజర్‌తో అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. మొదట ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు అధికారికంగా నిర్ణయించారు. అయితే రజినీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం 'జైలర్ 2' అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండటంతో, నేరుగా సూపర్ స్టార్‌తో బాక్సాఫీస్ పోరు వద్దనుకున్న ధనుష్ బృందం తమ సినిమాను దీపావళి బరిలోకి అంటే నవంబర్ 5 లేదా 6 వ తేదీకి వాయిదా వేయాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ముందుగా అనుకున్న అక్టోబర్ 16 తేదీకే స్ట్రీమింగ్ విండో లాక్ కావడంతో విడుదల మార్పుకు ఒప్పుకోవడం లేదని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు వర్సటైల్ యాక్టర్ సూర్య, దర్శకుడు జితు మాధవన్‌తో కలసి చేస్తోన్న యాక్షన్ కామెడీ చిత్రం 'సూర్య 47' ఇటీవలె తన షూటింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. విభిన్నమైన పోలీస్ అధికారి పాత్రలో సూర్య కనిపించనున్న ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ ఫహద్, నస్లేన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో వచ్చిన 'కరుప్పు', ఆగస్టు 14న రాబోతున్న వెంకీ అట్లూరి చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' తర్వాత, అదే ఏడాదిలో హ్యాట్రిక్ చిత్రంగా 'సూర్య 47' ను 2026 దీపావళి వేడుకల సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.
Also read: ప్రముఖ నటులకి గాయాలు.. ఒకేసారి 40 బులెట్స్
అదే సమయంలో కోలీవుడ్ డైనమిక్ స్టార్ సిలంబరసన్ (సింబు) మరియు దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందుతున్న భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'అరసన్' సైతం దీపావళి రేసులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం కోసం 5 నిమిషాల నిడివితో కూడిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియోను అక్టోబర్ 16న థియేటర్లలో ప్రదర్శించి, ఆ మరుసటి రోజు యూట్యూబ్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా దసరా మరియు దీపావళి పండగల రేసులో వరుసగా అగ్ర హీరోల సినిమాలు తమ విడుదల తేదీలను రీ-షెడ్యూల్ చేసుకుంటుండటంతో తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ పండుగల సీజన్లలో ఎవరెవరు తలపడనున్నారో అని అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Dhanush, Simbu, Suriya






