
సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగవంశీ రీసెంట్ గా సూర్య తో విశ్వనాధ్ అండ్ సన్స్ తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ధనుష్ తో కూడా అంతకు మించిన విజయాన్ని అందుకోవడానికి సిద్దమవుతున్నాడు.
రీసెంట్ గా ధనుష్, నాగవంశీ కలయికలో తెరకెక్కబోతున్న కొత్త చిత్రం అధికారకంగా స్టార్ట్ అయ్యింది. తమిళంలో 'లబ్బర్ పందు' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొంది ఘన విజయాన్ని అందుకున్న 'తమిళరసన్ పచ్చముత్తు' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేడుక మధురై సమీపంలోని ప్రముఖ మారనాటు కరుప్పణస్వామి ఆలయ ప్రాంగణంలో అభిమానుల కోలాహలం మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయంలో పూజా కార్యక్రమాల సందర్భంగా ధనుష్ స్వామివారికి 18 అడుగుల భారీ అరివాళ్ (కొడవలి) సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
'పారి వేట్టైక్కు పండకాల్ నట్టాచు' అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో గ్రామీణ నేపధ్యంలో సాగే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఈ పూజా వేడుకలో ప్రసిద్ధ నటుడు ఎస్. జె. సూర్య, వైవిధ్యమైన నటుడు 'ఉరియడి' విజయ్ కుమార్, యువ కథానాయిక ప్రీతి ముకుందన్ మరియు హాస్యబ్రహ్మ వడివేలు పాల్గొని సందడి చేశారు. ముఖ్యంగా గత 15 ఏళ్లుగా ధనుష్, వడివేలు మధ్య ఉన్న విభేదాలు ఈ సినిమాతో తొలగిపోవడం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కొన్ని శక్తుల వల్లే తమ మధ్య చిన్న దూరం పెరిగిందని, 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒకే తెరపై ధనుష్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందంటూ వడివేలు వేడుకలో భావోద్వేగానికి గురయ్యారు. సంచలన సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరాలు అందిస్తున్న ఈ భారీ చిత్రం 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: ఈ రోజు బాలు గారిని తలుచుకోవడం మానవ జన్మకి అవసరం!

ఒకవైపు D56 ప్రారంభోత్సవం జరుగుతుండగానే, ధనుష్ తీసుకున్న మరొక నిర్ణయం చిత్ర పరిశ్రమలో ప్రశంసలు అందుకుంటోంది. రజనీకాంత్ 'జైలర్ 2' అక్టోబర్ 15న విడుదలవుతున్న నేపథ్యంలో, ఆయనపై ఉన్న గౌరవంతో తన 'ఓం: చాప్టర్-1' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ధనుష్ ప్రకటించడం ఆయన పరిణతిని నిరూపించింది. 18 అడుగుల కత్తి సమర్పణ, 15 ఏళ్ల కలయిక మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ మేకింగ్‌తో 'D56' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీకర స్టూడియోస్ మరియు ప్రైమ్‌మార్క్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ కూడా సహా నిర్మాతలుగా ఉన్నారు. గతంలో ధనుష్‌కు 'సార్' వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈసారి అంతకు మించి విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు.
[Dhanush New Movie Pooja Ceremony In Madurai, Dhanush D56, Madurai Film Launch, Tamizharasan Pachamuthu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




