Home

»

Latest News

ధనుష్ - మృణాల్ ఠాకూర్ పెళ్లి.. అసలు కథ ఇదీ!

Mar 29, 2026

ధనుష్‌తో డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధనుష్-మృణాల్ పెళ్లి ఫొటోలు!

టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో గత కొంతకాలంగా ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. అదే తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush), 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ తనదైన శైలిలో స్పందిస్తూ నెటిజన్ల అనుమానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.

వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోల అసలు గుట్టు!
సోషల్ మీడియాలో ధనుష్, మృణాల్ ఠాకూర్ సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లి పీటలపై ఉన్నట్లు కొన్ని ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. అయితే ఇవన్నీ నిజమైనవి కావు. ఏఐతో సృష్టించిన ఈ మార్ఫింగ్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. చెన్నైలో వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, ఈ వేడుకకు పలువురు స్టార్ హీరోలు కూడా హాజరయ్యారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేశారు. కానీ అందులో రవ్వంత కూడా నిజం లేదని స్పష్టమైంది.

మృణాల్ ఏమన్నారంటే..?
ఈ డేటింగ్ రూమర్లపై మృణాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ధనుష్ నాకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే. మా మధ్య వృత్తిపరమైన గౌరవం తప్ప మరేమీ లేదు. ఇలాంటి రూమర్స్ చూస్తుంటే నాకు నవ్వొస్తోంది" అని ఆమె పేర్కొంది. అంతేకాకుండా, తను ప్రస్తుతం తన కెరీర్‌పై మాత్రమే దృష్టి పెడుతున్నానని, తన పని గురించి కాకుండా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ఇలాంటి పుకార్లు బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

పుకార్లకు ఆజ్యం పోసిన ఇన్ స్టా పోస్ట్!
ఇక వీరి మధ్య ఏదో ఉందని ఫ్యాన్స్ భావించడానికి బలమైన కారణం లేకపోలేదు. మృణాల్ ఠాకూర్ నటించిన 'దో దీవానే సెహర్ మే' మూవీ టీజర్ చూసిన ధనుష్, "చాలా బాగుంది" అంటూ పాజిటివ్ గా స్పందించాడు. దానికి మృణాల్ హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇవ్వడంతో నెటిజన్లు వీరిద్దరి మధ్య 'సమ్ థింగ్ సమ్ థింగ్' నడుస్తోందని ఫిక్స్ అయిపోయారు. అప్పట్లో ధనుష్ తన విడాకుల తర్వాత ఒంటరిగా ఉండటం, అదే సమయంలో మృణాల్‌ తరచూ చెన్నై వెళ్తుండటంతో.. ప్రేమ వార్తలు షికార్లు చేశాయి. ఇప్పటికేదైనా ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com