Home

»

Latest News

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ధ‌నుష్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్!

Nov 24, 2021 2:44PM

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలకు, పాత్ర‌ల‌కు చిరునామాగా నిలిచే త‌మిళ క‌థానాయ‌కుల్లో ధ‌నుష్ ఒక‌రు. అనువాద చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన ఈ టాలెంటెడ్ స్టార్.. త్వ‌ర‌లో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో `క‌ర్ణ‌న్`గా థియేట‌ర్స్ లో ఎంట‌ర్టైన్ చేసిన ధ‌నుష్.. ఆ త‌రువాత మాత్రం ఓటీటీ బాట ప‌డుతున్నారు. ధ‌నుష్ గ‌త చిత్రం `జ‌గ‌మే తంత్రం` జూన్ 18న‌ దిగ్గ‌జ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ప‌లు భాష‌ల్లో స్ట్రీమ్ కాగా.. అత‌ని నుంచి రాబోయే మ‌రో రెండు కొత్త సినిమాలు కూడా ఓటీటీలోనే సంద‌డి చేయ‌నున్నాయి. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. వేర్వేరు భాష‌ల‌కు చెందిన‌ ఈ రెండు చిత్రాలు కూడా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లోనే స్ట్రీమ్ కాబోతున్నాయి. `రాంఝానా`, `ష‌మితాబ్` త‌రువాత ధ‌నుష్ న‌టించిన మూడో హిందీ సినిమా `అత్రంగి రే`  ఈ డిసెంబ‌ర్ 24న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుండ‌గా.. కార్తిక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న త‌మిళ చిత్రం `మార‌న్` కూడా త్వ‌ర‌లో అదే ఓటీటీలో స్ట్రీమ్ కాబోతున్న‌ట్లు బ‌జ్.

మ‌రి.. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ధ‌నుష్ ఎలాంటి ఫ‌లితాల‌ను, గుర్తింపుని పొందుతారో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com