Devils Double Next level Review : డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ మూవీ రివ్యూ
on Jun 14, 2025
మూవీ: డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్
నటీనటులు: సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, యాషిక ఆనంద్, గీతిక తివారీ, రిడిన్ కింగ్ స్లే తదితరులు
ఎడిటింగ్: భరత్ విక్రమన్
మ్యూజిక్: ఒఫ్రో
సినిమాటోగ్రఫీ: దీపక్ కుమార్
నిర్మాతలు: వెంకట్ బోయనిపల్లి
కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: ఎస్. ప్రేమ్ ఆనంద్
ఓటీటీ: జీ5
కథ :
కృష్ణమూర్తి అలియాస్ కిస్సా (సంతానం) తన యూట్యూబ్ ఛానల్ లో సినిమాల రివ్యూలు ఇస్తుంటాడు. సినీ ప్రియులు, ప్రముఖుల నుంచి పొగడ్తలతో పాటు విమర్శలు ఎదుర్కొంటాడు. ఓ సారి 'డీడీ నెక్స్ట్ లెవెల్' అనే సినిమా స్క్రీనింగ్‌కు కుటుంబంతో కలిసి హాజరై, రివ్యూ ఇవ్వాలంటూ కిస్సాకి ఆహ్వానం అందుతుంది. అక్కడికి వెళ్లాక అది దెయ్యాల థియేటర్ అని తెలిసి షాకై ఇంటికి తిరిగొస్తాడు. అయితే అప్పటికే అతడి ఫ్యామిలీ అదే థియేటర్ కు వెళుతుంది. కుటుంబ సభ్యుల కోసం థియేటర్లోకి అడుగుపెట్టిన కిస్సాకు అక్కడి నుంచి బయట పడడం అసాధ్యమని అర్థమవుతుంది. అదే టైమ్‌లో ఓ వైపు సైకో కిల్లర్ వస్తాడు. ఈ తరుణంలో కుటుంబంతో కలిసి కిస్సా ఎలా బయటపడ్డాడు? అసలు డెవిల్ నిజంగానే ఉందా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ .. ఈ పేరు వినగానే ఇదేదో హారర్ మూవీరా బాబు అని అనుకుంటారంతా కానీ అంతగా భయపట్టే సీన్లు లేవు. సంతానం కామెడీ టైమింగ్ కోసం చూడాలనుకునే వారికి నచ్చదు. ఎందుకంటే కామెడీ తక్కువగా అనవసరమైన విషయాలు ఎక్కువగా ఉన్నాయి. కథ పాయింట్ చిన్నదే అయినా దానికి తగ్గట్టు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటే అది అందరికి కనెక్ట్ అవుతుంది. కానీ ఇందులో అదే లోపించింది.
రివ్యూ రైటర్స్ యాంగిల్ నుంచి సినిమాను ట్రోల్ లేదా స్పూఫ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ దాన్ని వాడుకోలేదు దర్శకుడు ప్రేమ్ ఆనంద్. హీరో రివ్యూ రైటర్ అని చెప్పారు తప్ప ఏ సినిమాకు రివ్యూ ఇచ్చారనేది చూపించలేదు. ఫ్యాన్స్ నుంచి రివ్యూ రైటర్లకు బోలెడు తిట్లు వస్తాయి. వాటిని కామెడీగా చూపించవచ్చు. అదీ చేయలేదు. కామెడీ కోసం బాత్రూమ్ లో ఆ సీన్లని పెట్టినట్టుగా అనిపిస్తుంది. బలవంతగా నవ్వు తెప్పించేలా ఆ సీన్లు ఉంటాయి. ఇక ఘర్షణ సినిమాలోని 'చెలియా చెలియా...' పాటను ఆ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్, యాషికా ఆనంద్ మీద పిక్చరైజ్ చేయడం కాస్త బాగుంటుంది. గౌతమ్ మీనన్‌ను ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ రాఘవన్ కింద చూపించారు. కానీ, ఆయన్ని సరిగ్గా వాడుకోలేదు. హీరో తల్లిగా నటించిన కస్తూరి చేత గ్లామర్ షో అంతగా వర్కవుట్ అవ్వలేదు.
హీరోయిన్ ఎందుకు ఉందో అర్థం కాదు పైగా తనని రెండు వేరియేషన్స్ లో చూపించాడు దర్శకుడు. సంతానం వాయిస్ సెట్ కాలేదు. హారర్ కామెడీ అని నమ్మి చూడాలనుకునే వారికి అవి లేకపోగా గోస్ట్ గా మిగిలిపోతుంది. అక్కడక్కడ సినిమాటోగ్రఫీ బాగుంది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దానిని సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అడల్ట్ సీన్లు లేవు. అక్కడక్కడ కాస్త వాయిలెన్స్ ఉంది తప్ప మిగతాదంతా ఒకే. సినిమా మొదటి నుండి చివరి వరకు చూడాలనుకుంటే ఓపిక చాలా అవసరం. భరత్ విక్రమన్ ఎడిటింగ్ ఒకే. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఓప్రో మ్యూజిక్ అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
కిస్సాగా సంతానం నటన ఆకట్టుకుంది. మిగతావారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : కామెడీ నెక్స్ లెవెల్ లేకపోవడం కాదు అసలు లేనే లేదు.. జస్ట్ ఒకే.
రేటింగ్: 2 / 5
✍️. దాసరి మల్లేష్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
