రెడ్ శారీలో స్వీట్ సునైనా
on Jun 23, 2022
దీప్తి సునయన ఈ పేరు సోషల్ మీడియా వేదికకు కొత్త కాదు. ఎప్పుడూ రీల్స్ తో, వెబ్ సిరీస్ తో, సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతూ ఉంటుంది దీప్తి. ఈమెకు యూత్ లో మంచి క్రేజ్ కూడా ఉంది. బిగ్ బాస్ సీజన్ - 2 లో పార్టిసిపేట్ చేసి పేరు తెచ్చుకుంది. బుజ్జి బుజ్జిగా మాట్లాడుతూ ఓవర్ లోడెడ్ క్యూట్ నెస్ తో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది . ఈ బుట్టబొమ్మ ఒక విధంగా సోషల్ మీడియా సెలెబ్రిటీ అని చెప్పుకోవచ్చు. డాన్స్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, కామెడీ చేస్తుంది ఆల్ రౌండర్ అన్నమాట. ఇక షణ్ముఖ్ జస్వంత్ తో రిలేషన్ బ్రేక్ అప్ చేసుకుని వార్తల్లో నిలిచేసరికి దీప్తి సునైనా పేరు ఇంకా ఎక్కువగా ఫేమస్ అయ్యింది. రొమాంటిక్ ఐస్ తో హాట్ డ్రెస్సెస్ వేసుకుని వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాని షాక్ చేసేస్తూ ఉంటుంది.
ఇక ఇప్పుడు కాస్త రూటు మార్చి చీరలు కడుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీప్తి. రెడ్ శారీలో ట్రెడిషినల్ గా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియా మస్త్ ట్రోల్ అవుతున్నాయి. షణ్ముఖ జస్వంత్ తో కలిసి ఎన్నో వీడియోస్ చేసింది దీప్తి . ఈ జంట అన్ని చోట్ల ఫేమస్ అయ్యింది. ఫైనల్ గా ఏమయ్యిందో ఏమో కానీ ఇద్దరి మధ్య బ్రేక్ వచ్చేసింది. ఆ బ్రేక్ తర్వాత ఎవరికీ వారు సొంతంగా సింగల్ గా వీడియోస్ చేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య బ్రేక్ అప్ ఐన దగ్గర నుంచి అమ్మడు హాట్ పిక్స్ డోస్ పెంచేసింది. " ఏ విషయం గురుంచి టెన్షన్ అవ్వకూడదు అంటే దైవ ప్రార్ధనే ముఖ్యం" అనే కాప్షన్ పెట్టి తన డివోషనల్ రెడ్ సారీ పిక్స్ పోస్ట్ చేసింది.
Also Read