Home

»

Latest News

'స్పిరిట్' వివాదం.. ఒక్క 'లైక్‌'తో వంగా బ్ర‌ద‌ర్స్‌కి షాకింగ్ కౌంట‌ర్ ఇచ్చిన దీపికా ప‌దుకొనే.!

Aug 22, 2026 12:03PM

రెబల్ స్టార్ ప్రభాస్ - డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న పాన్-ఇండియా చిత్రం 'స్పిరిట్' నిత్యం ఏదో ఒక వార్తతో నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ భామ దీపికా పదుకొణె తప్పుకోవడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు సినీ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తాజాగా ఈ వివాదంపై దీపికా స్పందించిన తీరు ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు తెరలేపింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (సందీప్ రెడ్డి వంగా సోదరుడు) మాట్లాడుతూ.. దీపిక ఈ సినిమా ప్రాజెక్ట్ కోసం లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా డిమాండ్ చేశారని, వర్కింగ్ అవర్స్ విషయంలోనూ షరతులు పెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా చర్చలు విఫలమయ్యాక కథలోని కీలక అంశాలను లీక్ చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంచనాలు దాటడంతోనే ఆమెను తప్పించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై దీపికా పదుకొణె నేరుగా ఎలాంటి నోటీసు లేదా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఒక ప్రముఖ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘమైన పోస్ట్‌ను 'లైక్' చేయడం ద్వారా తన సమాధానాన్ని పరోక్షంగా, అత్యంత ఘాటుగా వినిపించారు. ఒక్క లైక్‌తో వంగా బ్రదర్స్‌కు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

జర్నలిస్ట్ తన పోస్ట్‌లో.. "ఒక స్టార్ హీరోయిన్ 10 శాతం వాటా అడిగితే అది మగ అహంకారానికి దెబ్బలా అనిపిస్తోందా? అగ్ర హీరోలు వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ షేర్లు డిమాండ్ చేస్తే అది డిసిప్లిన్ అవుతుంది కానీ, ఒక మహిళ అడిగితే ఇబ్బందికరంగా మారుతుందా?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఒక మహిళ 'నో' చెప్పడాన్ని జీర్ణించుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని ఆ పోస్ట్‌లో తీవ్రంగా విమర్శించారు.

ఈ పోస్ట్‌కు దీపికా మద్దతు తెలపడంతో.. రెమ్యూనరేషన్, డేట్స్ వివాదంగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోని లింగ వివక్ష, జెండర్ ఈక్వాలిటీపై పెద్ద చర్చగా మారింది. దీపికా అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే, వంగా ఫ్యాన్స్ మాత్రం నిర్మాతల వైపే న్యాయం ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ వివాదాలతో సంబంధం లేకుండా 'స్పిరిట్' సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలీసు అధికారిగా ప్రభాస్ కనిపించనున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా, దీపికా పదుకొణె కూడా బాలీవుడ్‌లో వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

 

Deepika Padukone, Spirit Movie Controversy, Sandeep Reddy Vanga, Pranay Reddy Vanga, Prabhas Spirit Movie

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com