Home

»

Latest News

చిత్తూరు రాణిగా దీపిక!

Jul 21, 2016 12:13PM

"బాజీరావు మస్తానీ"తో సూపర్ హిట్ అందుకొన్న తర్వాత దీపిక పడుకొనే మరో హిందీ సినిమా అంగీకరించలేదు. తన సహనటి ప్రియాంకను ఫాలో అయ్యి హాలీవుడ్ కి పయనమయ్యింది. దాంతో బాలీవుడ్ కి ఇక "బై బై" చెప్పేసినట్లే అని అందరూ అనుకొన్నారు. అయితే.. "బాజీరావు మస్తానీ" సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన సంజయ్ లీలా భన్సాలీ మళ్ళీ "పద్మావతి" అనే సినిమా తీసేందుకు సమాయత్తమవుతున్నాడు. 

ఈ సినిమాలో టైటిల్ పాత్ర అయిన "పద్మావతి"గా దీపిక కనిపించనుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించనున్న ఈ సినిమా మొత్తం ఓ ముస్లిం రాజు పద్మావతి అనే రాణిపై కన్ను పడి.. ఆమెను దక్కించుకోవడం కోసం ఏం చేశాడు అనే అంశం చుట్టూ తిరుగుతుంది. మరి బాలీవుడ్ భామ దీపిక పడుకొనే తెలుగు జిల్లాలో ముఖ్యమైనదైన చిత్తూరు రాణిగా ఏమేరకు అలరిస్తుందో చూడాలి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com