
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారి చేసిన మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. విడుదలైన మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సాధారణంగా లోకేష్ కనగరాజ్‌ను మనం ఒక స్టార్ డైరెక్టర్‌గా చూశాం. కానీ ఈ సినిమాలో ఆయన ఒక పవర్ ఫుల్ మాస్ రోల్ అదరగొట్టడం, ఆయనకు తోడుగా వామికా గబ్బి గన్స్ పట్టుకుని స్క్రీన్ మీద చేసిన అరాచకం ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. ఈ 'DC' ప్రయాణం 50 కోట్లతో ఆగేలా లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
DC Movie Collections, Lokesh Kanagaraj, Wamiqa Gabbi





