Home

»

Latest News

మా సంస్థ‌లో   లేడీ డైర‌క్ట‌ర్ తో ఫ‌స్ట్  సినిమా  ఇది - సురేష్ బాబు

Jun 7, 2019 12:29PM

మా సురేష్ ప్రొడక్ష‌న్స్ సంస్థ 55 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇన్నేళ్ల‌లో లేడీ డైరక్ట‌ర్ తో చేసిన తొలి సినిమా `ఓ బేబి`.  నిజానికి గ‌తంలో నందిని రెడ్డితో సినిమా చేయాల్సింది. కానీ, అప్పుడు కుద‌ర‌లేదు. ఇప్ప‌టికి కుదిరింది.  అదే కాకుండా మా ఫ్యామిలీలో వెంక‌టేష్‌, రానా ఇలా అంద‌రితో సినిమాలు చేసాం. కానీ మా ఫ్యామిలీకి చెందిన  లేడి యాక్ట్రెస్ తో  సినిమా చేయ‌డం కూడా ఇన్నేళ్ల‌లో ఇదే తొలిసారి. అలాగే చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి మెలిసి పెరిగిన జ‌గ‌ప‌తి బాబు గారు కూడా మా బేన‌ర్ లో న‌టించ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఇలా ప‌లు ప్ర‌త్యేక‌త‌ల‌తో `ఓ బేబి` సినిమా వ‌స్తోంది. కొరియ‌న్ భాష‌లో రూపొందిన ఈ సినిమా ఇప్ప‌టికే ఏడెనిమిది భాష‌ల్లో రీమేకై విజ‌య‌వంత‌మైంది. తెలుగులో ఇలాంటి సినిమా రావ‌డం కూడా ఇదే ప్ర‌థమం.  క‌చ్చితంగా సినిమా ఆడుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com