కట్ చేస్తే... సినిమాగా అసిస్టెంట్ డైరెక్టర్ స్టోరీ!
on Apr 2, 2020
అనగనగా ఓ సహాయ దర్శకుడు. అతడికి సినిమా మేకింగ్ గురించి ఎలాంటి ఐడియా లేదు. కానీ, అతడితో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ దొరుకుతాడు. మధ్యలో అతడికో ప్రేమ వ్యవహారం. చివరికి ఏం జరిగిందనే కథతో 'కట్ చేస్తే' అని ఓ సినిమా తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'గద్దలకొండ గణేష్' సినిమా గుర్తుందా? రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ కథతో సినిమా తీయాలని, గ్యాంగ్స్టర్ దగ్గరకు వెళతాడు. 'కట్ చేస్తే' కూడా ఆ టైపు కథతో వినోదాత్మకంగా తెరకెక్కుతోందట.
'కథ', '24 కిస్సెస్', 'చీకటి గదిలో చిలకోట్టుడు' ఫేమ్ అదిత్ అరుణ్ 'కట్ చేస్తే' సినిమాలో హీరో. ప్రియా భవానీ శంకర్ ఇందులో హీరోయిన్. మంచు మనోజ్ పాన్ ఇండియన్ సినిమా 'అహం బ్రహ్మాస్మి'లోనూ ఆమె హీరోయిన్. నిజానికి, 'అహం బ్రహ్మాస్మి' కంటే ముందు 'కట్ చేస్తే' సినిమాకి ప్రియా భవానీ శంకర్ సంతకం చేశారట. అదిత్ అరుణ్ మిగతా సినిమాలతో బిజీగా ఉండటంతో షూటింగ్ కొంచెం ఆలస్యమైంది. ఈలోపు కరోనా వచ్చి పడింది. లాక్ డౌన్ తొలగించిన తర్వాత హైదరాబాద్, చెన్నైలో సినిమా షూటింగ్ చేయనున్నారు.
Also Read